ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్(మీర్‌పేట): మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు.. తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించిన ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన మీర్‌పేట్ పోలీసులు బుధవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు.
సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాధన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వేంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించినప్పటికీ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో 25 జనవరి, 2021న సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సె లింగ్ ఇచ్చారు. అయినా వెంకటేశ్వర్లు తన బుద్ధి మార్చుకోకుండా మరలా మహిళను వేధించడంతో పాటు లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసుగు చెందిన ఆమె మరోసారి సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. 2021, మేలో వెంకటేశ్వర్లును రిమాండ్ చేశారు. ఆతర్వాత సదరు మహిళ ఫోన్ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడినుంచి మీర్‌పేట సీతాహోమ్స్‌కు మార్చింది.
జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనంచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీశాడు.
ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పద జాలంతో ధూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: (Hyderabad: చదివేది బీటెక్, సీఏ.. చేసే పనులేమో చైన్ స్నాచింగ్‌లు..)
Comments
Please login to add a commentAdd a comment