కదులుతున్న కారులో.. మూడు గంటలు గ్యాంగ్‌రేప్
కదులుతున్న కారులో.. మూడు గంటల పాటు ఏకధాటిగా ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. కోల్‌కతా విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఉన్న వీఐపీ రో డ్డులో గల ఓ బారులో ఆమె పాటలు పాడుతుంది. తన షిఫ్టు ముగిసిన తర్వాత సెక్టార్ 5 లోని ఓ కేఫ్‌కు వెళ్దామనుకుంది. దాంతో మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని, సాల్ట్ లేక్ సెక్టార్ 5 లోని ఆర్‌డీబీ సినిమాస్ వద్ద దిగింది. నగరానికి కొత్త కావడంతో దారి అడుగుతుండగా ఒక వ్యక్తి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. కానీ అతడు ఆమెను తప్పుదోవ పట్టించాడు. ఆమె నడుస్తుండగా అతడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఓ కారు ఆమె ముందుకు వచ్చింది. అందులోనివాళ్లు ఆమెను లోపలకు లాగారు.
లోపల నలుగురు ఉన్నారు. వాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై కదులుతున్న కారులోనే అత్యాచారం చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కారు ఓ కాలువ దగ్గర ఆగినప్పుడు ఆమె కారు అద్దం తెరిచి, గట్టిగా అరిచింది. దాంతో భయపడిన ఆ నలుగురూ ఆమెను కారులోంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ టాక్సీ డ్రైవర్ చూసి పోలీసులకు తెలిపాడు. వాళ్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఆమె శరీరం నిండా కోసిన గాయాలున్నాయని, ఆమె మానసికంగా కూడా బాగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అయితే గతంలో జరిగిన పార్క్ స్ట్రీట్ ఉదంతంలోలా కాకుండా పోలీసులు వెంటనే స్పందించడం ఇక్కడ విశేషం. అప్పట్లో నాలుగు రోజుల తర్వాత బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించడం తీవ్ర వివాదం అయ్యింది.