'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు | Nun gangrape case: Police gets visuals of four accused from CCTV footage | Sakshi
Sakshi News home page

'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు

Published Sun, Mar 15 2015 11:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు

'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు

రణఘాట్(పశ్చిమబెంగాల్): కోల్ కత్తాలో 72 ఏళ్ల సన్యాసిని(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్ను సొంతం చేసుకున్న సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు ప్రారంభించగా ఎనిమదిమంది పట్టుబడ్డారు. మరికొందరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈలోపు నిందితులను అరెస్టు చేసేందుకు అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ.లక్ష అందిస్తామని అంతకుముందు పోలీసులు ప్రకటించారు.

 

కోల్కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో  72 సం.రాల  నన్ పై  సామూహిక  అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అర్థరాత్రి తరువాత ఓ స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను  దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement