విద్యార్థినిపై కొరియోగ్రాఫర్ గ్యాంగ్‌రేప్
- వెస్ట్‌మారేడ్‌పల్లిలో దారుణం..
హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లిలో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థిని నగరంలో సందర్శించేందుకు వచ్చింది. బీకామ్ విద్యార్థి అయిన ఆమెకు ఎయిర్‌పోర్టులో పింకీ అనే మహిళ పరిచయం అయింది. తనతో వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్‌మెంటుకు తీసుకెళ్లింది. అక్కడ ఆమె స్నేహితుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రీత్ సెర్గిల్ విద్యార్థినికి నరకం చూపించాడు.
ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత హించించాడు. మరునాడు తన స్నేహితులతో కూడా గ్యాంగ్‌రేప్ చేయించాడు. తనపై జరిగిన దారుణాన్ని టిష్యూ పేపర్ మీద రాసి బయటకు విసరడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపారని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ సెర్గిల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.