గన్పెట్టి డ్యాన్సర్పై నలుగురు లైంగిక దాడి | UP dancer gang raped by a company executives | Sakshi
Sakshi News home page

గన్పెట్టి డ్యాన్సర్పై నలుగురు లైంగిక దాడి

Published Tue, Aug 16 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

గన్పెట్టి డ్యాన్సర్పై నలుగురు లైంగిక దాడి

గన్పెట్టి డ్యాన్సర్పై నలుగురు లైంగిక దాడి

లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ డ్యాన్సర్పై నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరంతా ఓ ప్రముఖ ఆయుర్వేద మందుల కంపెనీకి చెందిన వారని తెలుస్తోంది. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవ్ రాజ్ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్ధాయి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి అష్ఫాక్ అనే వ్యక్తి ద్వారా పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరాడు. దీంతో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తన బృందంతో వచ్చిన డ్యాన్సర్ అర్ధరాత్రి గడిచే వరకు ఆడిపాడింది. ఇది చూస్తూ పార్టీలో ఉన్నవాళ్లంతా బాగా తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ నలుగురు మాత్రం పీకల దాకా తాగి అక్కడి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో ప్రధాన డ్యాన్సర్ వారిని ప్రశ్నించింది. సత్యవీర్ సింగ్ మాత్రం పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె ఆ గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో ఉన్న ముగ్గురు తలుపు వేశారు. అనంతరం ఆమె తలకు తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి నలుగురి అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరంతా లక్నోకు చెందినవారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement