ఒంటరిగా ఉన్న వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన నేరంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఒంటరిగా ఉన్న వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన నేరంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పింప్రి తలావో ప్రాంతంలో జరిగింది. బ్రహ్మ లాహు జైపాల్, లక్ష్మణ దుర్గ పట్టిమణి, వినోద్ హరిశ్చంద్ర జాదవ్ అనే ఈ ముగ్గురు బుధవారం నాడు ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల వివాహితపై అత్యాచారం చేశారు.
బాధితురాలు నిందితులను గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.