ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు ఆగడంలేదు. ముజఫర్నగర్ జిల్లాలోని కెతోరా గ్రామంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ఏదో పనిమీద ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు సలీం ఖురేషీ, జహీరత్ అనే ఇద్దరు యువకులు ఆమెను ఎత్తుకెళ్లి, ఓ ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశారన్నారు.
నిందితులిద్దరూ పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నారు. మరో సంఘటనలో మజ్లిస్పూర్ తోఫిర్ గ్రామంలో మరో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నీతు అనే నిందితుడు ఆమెను ఎత్తుకెళ్ల చెరుకుతోటల్లో అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతిపై సామూహిక అత్యాచారం
Published Fri, Jul 25 2014 11:30 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement