గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడటంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.