స్వల్పవివాదమే హత్యకు దారితీసింది | Police Arrested Two accused In Gudivada Murder Case | Sakshi
Sakshi News home page

స్వల్పవివాదమే హత్యకు దారితీసింది

Aug 21 2019 9:14 AM | Updated on Aug 21 2019 9:14 AM

Police Arrested Two accused In Gudivada Murder Case - Sakshi

మాట్లాడుతున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, నిందితులు మెకానిక్‌ శ్రీను, టి.చంద్రశేఖర్‌ 

సాక్షి, గుడివాడ(కృష్ణా) : గుడివాడ పట్టణంలోని ధనియాలపేటలో జరిగిన హత్యకేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యజరిగిన వెంటనే తాము నిందితుల్ని గుర్తించామని గుడివాడ డీఎస్పీ సత్యానందం విలేకరులకు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధనియాలపేటకు చెందిన దూల భార్గవ్‌  శనివారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం పాఠకులకు విధితమే. కాగా ఈహత్యకేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని పట్టుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

తాగిన మైకంలో ఏర్పాడిన స్వల్ప వివాదమే హత్యకు దారితీసిందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను మంగళవారం సాయంత్రం స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలో  పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన దూల భార్గవ్‌ శుక్రవారం రాత్రి సమయంలో దుర్భాషలాడటంతోనే ఈహత్య జరిగిందన్నారు. బుధవారం ఉదయం నిందితుల్ని కోర్టుకు హాజరు పరుస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సీఐ దుర్గారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement