రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన తగాదాలు కక్షగా మారి అది చివరకు ఓ బాలిక అత్యాచారానికి గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉండటంతో.... ఒక కుటుంబానికి చెందిన పిల్లలు... మరొక కుటుంబం వారిని ఎలాగైనా అభాసుపాలు చేయాలని పథకం వేశారు. ఆ కుటుంబంలోని అమ్మాయితో స్నేహాన్ని నటిస్తూ, ఆమెను మభ్యపెట్టి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేకాకుండా.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తుండగా మిగిలినవారు ఆ ఘటనను సెల్ఫోన్లలో కూడా చిత్రీకరించారు. అనంతరం సెల్ ఫోన్లలో స్నేహితులకు పంపిస్తున్న విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులపై నిర్బయ, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.