ముజఫర్ నగర్ పునరావాస కేంద్రంలో యువతిపై అత్యాచారం | Victim at Muzaffarnagar relief camp raped by two youths | Sakshi
Sakshi News home page

ముజఫర్ నగర్ పునరావాస కేంద్రంలో యువతిపై అత్యాచారం

Published Sun, Nov 3 2013 7:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Victim at Muzaffarnagar relief camp raped by two youths

ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఫుగునా జిల్లా జోగ్యా ఖేరి గ్రామంలోని పునరావాస శిబిరంలో మత ఘర్షణ బాధితురాలిపై శనివారం సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఫుగునా గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో బాధితులను వేరే ప్రాంతానికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను సచిన్, సునీల్ కుమార్ లుగా గుర్తించారు.
 
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. బాధితురాలు పునరావాస శిబిరంలో తల్లితండ్రులతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. అత్యాచార విషయాన్ని బయటపెడితే చంపివేస్తామని నిందితులు బెదిరించినట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement