riot victim
-
అల్లర్ల బాధితురాలిపై అమానుషం!
ముజఫర్‌నగర్: 2013 నాటి ముజఫర్‌నగర్ అలర్లతో సొంతూరిని విడిచి.. కుటుంబంతోపాటు వేరే గ్రామానికి వలసవచ్చిన ఓ 14 ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఆ బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్పట్ జిల్లా అంబెటా గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో గ్రామ మాజీ ప్రధాన్ జహీర్ కొడుకు జుల్ఫమ్తోపాటు మరో ఇద్దరు యువకులపై పోలీసులు ఐపీసీ 376 (డీ) (గ్యాంగ్‌రేప్) ప్రకారం కేసు నమోదుచేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బాధితురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం బాధిత బాలిక పొలం దగ్గరికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులను ఆమెను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో బాలిక అపస్మారక స్థితిలో కుటుంబసభ్యులకు కనిపించింది. ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు నిరసన తెలియజేయడంతో నిందితుడు వారిని చితకబాదాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 2013లో ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన మతఘర్షణల కారణంగా ఆ బాలిక కుటుంబం రోడ్డునపడింది. కట్టుబట్టలతో సొంతూరు విడిచిపెట్టి అంబెటాకు వలస వచ్చింది. -
ముజఫర్ నగర్ పునరావాస కేంద్రంలో యువతిపై అత్యాచారం
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఫుగునా జిల్లా జోగ్యా ఖేరి గ్రామంలోని పునరావాస శిబిరంలో మత ఘర్షణ బాధితురాలిపై శనివారం సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఫుగునా గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో బాధితులను వేరే ప్రాంతానికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను సచిన్, సునీల్ కుమార్ లుగా గుర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. బాధితురాలు పునరావాస శిబిరంలో తల్లితండ్రులతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. అత్యాచార విషయాన్ని బయటపెడితే చంపివేస్తామని నిందితులు బెదిరించినట్టు తెలిసింది.