12ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
12ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో బానియాతర్ పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. భేత్రి రైల్వే క్రాసింగ్ వద్ద మంచినీరు తెచ్చుకునేందుకు బాలిక వెళ్లగా గమనించిన ముగ్గురు యవకులు ఆమెను బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
అత్యాచారానికి పాల్పడిన ఆ యువకులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అత్యాచారానికి గురైన ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.