
ముంబైలో గ్యాంగ్ రేప్
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో గ్యాంగ్ రేప్ వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో గ్యాంగ్ రేప్ వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి స్నేహితులే ఈ అకృత్యానికి పాల్పడ్డారు. సబర్బన్ జార్జిగాన్లోని సంతోష్నగర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
దీపావళి వేడుకలు చేసుకుందామని చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారీ దురాగతానికి ఒడిగట్టారు. ఆరుగురు నిందితులు 20 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. షాక్ నుంచి ఆలస్యంగా కోలుకున్న బాధితురాలు ఆదివారం తన బామ్మకు విషయం చెప్పింది. బామ్మతో కలిసి బాధితురాలు దిన్దోషి పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.