బిహార్‌లో గత వారం 12 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మోతిహరి: బిహార్‌లో గత వారం 12 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 15న మోతిహరి సమీపంలోని బేడీవాన్ మధువన్ గ్రామానికి చెందిన బాలిక గ్రామ సమీపంలోని మామిడితోటలో పండ్లు తెచ్చుకునేందుకు వెళ్లగా ప్రమోద్ సాహ్ని, కమలేశ్‌సాహ్ని అనే ఇద్దరు వ్యక్తులు బాలికను గ్యాంగ్‌రేప్ చేశారు.
తర్వాత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టుచేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు గురువారం ధర్నా చేశారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు.