
రాయ్‌పూర్: పెళ్లి పేరుతో మోసం చేసి బాలిక, ఆమె స్నేహితురాలిపై దారుణానికి ఒడిగట్టారు కొందరు యువకులు. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
కొరియా జిల్లా జాగ్రాఖండ్‌కు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలతో నమ్మించాడు. స్నేహితులతో కలిసి పథకం ప్రకారం పెళ్లి పేరుతో బాలికను, ఆమె స్నేహితురాలిని వేరే ఊరికి తీసుకెళ్లాడు. తొమ్మిది మంది యువకులు ఆ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 15 రోజులపాటు కీచకుల చెరలో ఉన్న బాలికలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. చికిత్స నిమిత్తం బాలికలను ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదుచేసుకుని ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు ఏఎస్పీ నివేదిత శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment