అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.
పుట్టపర్తి మండలానికి చెందిన బాధిత బాలిక సంక్రాంతి సెలవుల్లో కదిరిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండగ తర్వాత ఆదివారం ఆ అమ్మాయిని తిరిగి స్వగ్రామానికి పంపించేందుకు ఆమె మామ ఆటోలో తీసుకువచ్చి కదిరి బస్టాండ్‌లో బస్ ఎక్కించాడు. అనంతరం బాలిక తండ్రికి సమాచారమిచ్చి ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయిని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్, మరో నలుగురు కుట్ర పన్నారు. మీ మామకు యాక్సిడెంట్ అయిందని, తీసుకురమ్మన్నారని మాయ మాటలు చెప్పి బాలికను బస్ నుంచి దింపి ఆటోలో తీసుకెళ్లారు. నల్లమాడ అటవీప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం నిందితులు పరారయ్యారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ వార్త వినగానే బాలిక తల్లికి గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మాయమాటలు చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్
Published Fri, Jan 22 2016 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM
Advertisement
Advertisement