ప్రతీకాత్మకచిత్రం
చండీగఢ్ : హరియాణకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై స్వయంగా ఓ హెడ్ కానిస్టేబుల్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని పోలీసులు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నిందితులు బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. పల్వాల్ మహిళా పోలీస స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పల్వాల్ ఎస్పీ వసీం అక్రం తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు.
ప్రధాన నిందితుడు జోగీందర్ అలియాస్ మింటూతో పల్వాల్ జిల్లా అల్వార్‌పూర్‌లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు.ఫరీదాబాద్, జింద్, పల్వాల్‌లో పనిచేస్తుండగా జోగీందర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్ 2017లో నిందితుడు తన సోదరుడు ఫరీదాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన సోదరుడిని పరిచయం చేయగా అతడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ జోగీందర్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు డబ్బు కోసం వేధించాడని ఆరోపించారు. కాగా విచారణలో నిందితుడు జోగీందర్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. మరోవైపు బాధితురాలు కూడా వివాహితని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment