Main accused
-
మణిపూర్ నిందితుడి ఇల్లు దహనం.. కుటుంబం వెలివేత
ఢిల్లీ/ఇంఫాల్: కేవలం 26 సెకండ్ల నిడివి ఉన్న వీడియో.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి.. ఆపై జరిగిన రాక్షాస క్రీడపై సభ్యసమాజం రగిలిపోతోంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ఘటనపై ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్ ఇంటిని ఓ మూక తగలబెట్టేసింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి. మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు హుయిరేమ్. అయితే అప్పటికే వీడియో వైరల్ కావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి.. తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు. ఇదీ చదవండి: ఎవరీ మెయితీలు.. కుకీలతో ఉన్న గొడవలేంటంటే.. బుధవారం రాత్రి థౌబల్ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అకృత్యానికి సంబంధించి మరో ముగ్గురినీ సైతం అరెస్ట్ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు. వీళ్ల ద్వారా మిగతా నిందితులను పట్టకునే పనిలో ఉన్నారు మణిపూర్ పోలీసులు. Manipur | The main culprit who was wearing a green t-shirt and seen holding the woman was arrested today morning in an operation after proper identification. His name is Huirem Herodas Meitei (32 years) of Pechi Awang Leikai: Govt Sources (Pic 1: Screengrab from viral video, Pic… pic.twitter.com/e5NJeg0Y2I — ANI (@ANI) July 20, 2023 మెయితీల గిరిజన హోదా డిమాండ్‌తో మొదలైన వ్యవహారం.. మే 3వ తేదీన కుకీ-మెయితీల మధ్య ఘర్షణలు మొదలై మణిపూర్ హింసకు ఆజ్యం పోసింది. ఆ సమయంలో ఓ ఫేక్ వీడియో వైరల్ కావడంతో రగిలిపోయిన మెయితీ వర్గం.. కుకీ ప్రజలపై దాడులకు సిద్ధపడింది. ఈ క్రమంలో మే 4వ తేదీన.. బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు వంటి ఆయుధాలు చేతపట్టిన సుమారు 800 మంది మెయితీ వర్గానికి చెందిన వారు, కుకీ గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసుల నుంచి బలవంతంగా లాక్కెళ్లి.. నగ్నంగా ఊరేగించారు. అడ్డొచ్చిన ఇద్దరిపైనా దాడి చేసి చంపినట్లు(వాళ్లలో 21 ఏళ్ల యువతికి చెందిన తండ్రి, సోదరుడు ఉన్నారు) తెలుస్తోంది. ఆపై ఆ మహిళలిద్దరినీ ఊరేగించి.. సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదీ చదవండి: మే 4న జరిగింది ఇదే.. మణిపూర్ హైకోర్టు ఆదేశాలనుసారం.. ఇటీవల కొన్నిచోట్ల ఇంటర్నెట్ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ ఈ హేయమైన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట హఠాత్తుగా ప్రత్యక్షమైంది. బుధవారం సోషల్‌మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. దేశం ఉలిక్కిపడింది. దీంతో వైపు రాజకీయ దుమారం చెలరేగగా.. ప్రధాని మోదీ సైతం నిందితులను వదిలిపెట్టమని ప్రకటించారు. మరోవైపు కేంద్రంతో మాట్లాడిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్.. నిందితులకు మరణ శిక్ష పడేలా చూస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా నుంచి వీడియోలను తొలగించాలని కేంద్రం అన్ని ఫ్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా కమిషన్ సైతం స్పందించి ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఇక.. ఘటనను హేయనీయమైన చర్యగా అభివర్ణించిన సుప్రీం కోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుక చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తూ.. వచ్చే శుక్రవారానికి(జులై 28కి) విచారణ వాయిదా వేసింది. ఇదీ చదవండి: మణిపూర్ వీడియో పాతది.. అందుకే.. -
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్
-
Liquor Case: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.. కొండల్‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొండల్‌రెడ్డితో పాటు మరో ప్రధాన నిందితుడు బాలరాజ్‌గౌడ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఇబ్రహీంపట్నంకు తరలిస్తున్నారు. ఆ మధ్య జరిగిన నల్లగొండ మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ.. నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. డిసెంబర్ 16వ తేదీన ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి.. అస్వస్థతకు గురైన విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆపై ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఐబీ, ఓసీ లాంటి బ్రాండ్లకు నకిలీ లిక్కర్‌ను ఒడిషా తయారు చేస్తున్నారు. వాటిని తెలంగాణ శివారు ప్రాంతాలకు తరలించి.. రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారానికి గతంలో పాతిక మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ స్కామ్‌లో వీళ్లిద్దరి పాత్ర, లింకులపై ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు తేల్చాల్సి ఉంది. -
మహేష్ బ్యాంక్ కేసు ప్రధాన నిందితుడు నైజీరియన్ అరెస్ట్.. తప్పించుకునేందుకు..
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 13 కోట్ల హ్యాకింగ్ కేసులోని ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి తప్పించుకునేందుకు నైజీరియన్ నిందితుడు విఫల ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్స్ సహా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ హ్యాకర్స్, క్యాష్ రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణలో పోలీసులకు నిందితులు ఏమాత్రం సహకరించడం లేదు. మహేష్ బ్యాంక్ కేసులో నిందితులు సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చదవండి: కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది? -
పుల్వామా దాడి వెనుక ‘మహ్మద్ భాయ్’
శ్రీనగర్ : పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ అహ్మద్‌ఖాన్ పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. కాగా, జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు గుర్తించారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
షాకింగ్ : మహిళా పోలీసుపై నాలుగేళ్లుగా..
చండీగఢ్ : హరియాణకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై స్వయంగా ఓ హెడ్ కానిస్టేబుల్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని పోలీసులు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నిందితులు బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. పల్వాల్ మహిళా పోలీస స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పల్వాల్ ఎస్పీ వసీం అక్రం తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్లోనే మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రధాన నిందితుడు జోగీందర్ అలియాస్ మింటూతో పల్వాల్ జిల్లా అల్వార్‌పూర్‌లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు.ఫరీదాబాద్, జింద్, పల్వాల్లో పనిచేస్తుండగా జోగీందర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్ 2017లో నిందితుడు తన సోదరుడు ఫరీదాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన సోదరుడిని పరిచయం చేయగా అతడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ జోగీందర్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు డబ్బు కోసం వేధించాడని ఆరోపించారు. కాగా విచారణలో నిందితుడు జోగీందర్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. మరోవైపు బాధితురాలు కూడా వివాహితని పోలీసులు చెప్పారు. -
కాల్‌మనీ నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ అరెస్ట్
-
ఎట్టకేలకు వాడు దొరికాడు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ క్రైస్తవ సన్యాసిని సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. స్థానిక సెల్దా రైల్వే స్టేషన్లో దిగుతుండగా నజ్రూల్ అకా నాజూ (28)ను బుధవారం సాయంత్రం సీఐడి అరెస్టు చేసింది. అతడు నగరానికి వస్తున్నాడనే పక్కా సమాచారంతో మాటు వేశామని సీఐడి అధికారి చిత్తరంజన్ నాగ్ తెలిపారు. నిందితుడు ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సరిహద్దులో దాక్కున్నట్టుగా తమ విచారణలో తెలిపాడన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని రాణాఘాట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కాగా కోల్‌కతాలో 72 సంవత్సరాల నన్‌పై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నదియా జిల్లాలోని ఓ కాన్వెంట్ స్కూల్లోకి చొరబడ్డ దొంగలు నన్‌పై అత్యాచారానికి తెగబడి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సీఐడి దర్యాప్తుకు ఆదేశించారు. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇపుడు ప్రధాన నిందితుడి అరెస్టుతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు దొరికినట్టయింది.