సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 13 కోట్ల హ్యాకింగ్ కేసులోని ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి తప్పించుకునేందుకు నైజీరియన్ నిందితుడు విఫల ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
కాగా ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్స్ సహా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ హ్యాకర్స్, క్యాష్ రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణలో పోలీసులకు నిందితులు ఏమాత్రం సహకరించడం లేదు. మహేష్ బ్యాంక్ కేసులో నిందితులు సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.
చదవండి: కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది?
Comments
Please login to add a commentAdd a comment