mahesh bank case
-
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో కీలక పురోగతి కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్‌లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు. మహేష్ బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్ సీపీ వెల్లడించనున్నారు. చదవండి: Mahesh bank Fraud Case: తప్పించుకునేందుకు భవనం నుంచి దూకిన నైజీరియన్ -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసులో కీలక పురోగతి
-
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మహేష్ బ్యాంక్ కేసు ప్రధాన నిందితుడు నైజీరియన్ అరెస్ట్.. తప్పించుకునేందుకు..
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 13 కోట్ల హ్యాకింగ్ కేసులోని ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి తప్పించుకునేందుకు నైజీరియన్ నిందితుడు విఫల ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్స్ సహా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ హ్యాకర్స్, క్యాష్ రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణలో పోలీసులకు నిందితులు ఏమాత్రం సహకరించడం లేదు. మహేష్ బ్యాంక్ కేసులో నిందితులు సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చదవండి: కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది? -
మహేష్ బ్యాంక్ కేసు.. సినీ ఫక్కీలో భారీ చేజ్.. 2 కి.మీ. వెంటాడి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సూత్రధారులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో కనిపెట్టారు. సోమవారం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రత్యేక బృందంపై దాడికి దిగాడు. అతికష్టమ్మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో సహా మొత్తం నలుగురిని పట్టుకున్న పోలీసులు సిటీకి తరలిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహేష్ బ్యాంక్ సొమ్ము తొలుత 4 ఖాతాల్లోకి బదిలీ అయింది. ఆపై వాటి నుంచి ఢిల్లీ, బెంగళూర్, కేరళ సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 128 ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాజేశారు. సూత్రధారులతో పాటు ఈ ఖాతాదారులనూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్ టీమ్ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితలను అరెస్టు చేసింది. రెండు కిలోమీటర్లు వెంటాడి... పట్టుబడిన వారి ప్రాథమిక విచారణ నేపథ్యంలో కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కేరళల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవ్వరూ చిక్కకపోయినా.. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం మాత్రం ముగ్గురు ఖాతాదారులతో పాటు దళారిగా వ్యవహరించిన ఓ నైజీరియన్‌ను గుర్తించింది. వారిని పట్టుకున్న పోలీసులు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. హఠాత్తుగా అతను పోలీసులపై ఎదురుతిరిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ అతడి ఫ్లాట్ నుంచి బయటకు పరుగుతీశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ వీధుల్లో అతడి కోసం భారీ ఛేజింగ్ చేశారు. దాదాపు 2 కి.మీ. వెంటాడి అదుపులోకి తీసుకోగలిగారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సైతం మరికొందరు ఖాతాదారులను పట్టుకున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ సహా ఇతర సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది. -
బ్యాంకు అప్రైజరే దొంగ!
-
బ్యాంకు అప్రైజరే దొంగ!:మహేష్ బ్యాంకు చోరీ కేసు
హైదరాబాద్: ఏఎస్ నగర్‌లోని మహేష్ కో అపరేటివ్ బ్యాంక్ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు అప్రైజర్ బ్రహ్మచారి, అతని భార్య, కుమారుడిని పో్లీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కోట్ల 50 లక్షల రూపాయల విలువైలన 15కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు విలేకరులకు తెలిపారు. చోరీ సమయంలో నిందితుడు బ్యాంకులోని ఇతర అర్మరాలను ముట్టుకోకుండా, బంగారం తాకట్టు పెట్టే అర్మరాను మాత్రమే ముట్టుకున్నట్లు చెప్పారు. రెండు తాళం చేతులతో లాకర్లు తెరిచి నగలు ఎత్తుకెళ్లారు. దాంతో బ్యాంకు గురించి, లోపలి పరిసరాల గురించి బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు తాము అనుమానించినట్లు తెలిపారు. తొలుత బ్యాంకు సిబ్బంది అందరిపైన, బ్యాంకులో ఉద్యోగం మానివేసి వెళ్లినవారిపై కూడా నిఘా పెట్టామని చెప్పారు. ఈ కేసు విచారణలో బ్యాంకులోని సిసి కెమెరా పుటేజీలు బాగా ఉపయోగపడినట్లు తెలిపారు. నెల రోజుల సిసి కెమెరా పుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. సిసి కెమెరా పుటేజీలలో నగలు దోచుకువెళ్లిన వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. అయితే అతని ఎత్తు, శరీ దారుఢ్యం ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. ఒరిజినల్ తాళం చేతులు లేకుండా మారు తాళాలు తయారు చేయడం సాధ్యం కాదని ఆ తాళాలు తయారు చేసిన కంపెనీవారు తెలిపినట్లు చెప్పారు. మొత్తం ఏడు తాళాలు, రెండు సెట్లు ఉన్నాయి. బ్యాంకు పనిచేసే సమయంలో ఒరిజినల్ తాళాలను సీనియర్ అకౌంటెంట్ పక్కనున్న సొరుగులో నుంచి ఓ వ్యక్తి తీసిన దృశ్యాలు కూడా సిసి కెమెరాలో కనిపించాయి. ఆ వ్యక్తి తాళాల సెట్ తీసుకొని బాత్ రూమ్‌లోకి వెళ్లినట్లు ఆ దృశ్యాల ద్వారా తెలుసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. సీనియర్ అకౌంటెంట్ సీటు పక్కనే అప్రైజర్ బ్రహ్మచారి కూర్చుంటాడు. అతనే ప్రధాన నిందితుడని పోలీస్ కమిషనర్ ఆనంద్ చెప్పారు. కీసర మండలం మాదాపురం గ్రామంలో బ్రహ్మచారి భార్య, కొడుకు ఉంటారు. వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. చోరీ చేసిన తరువాత బ్యాగ్‌ను కూడా వారే తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ చోరీకి నిందితుడు ఆరు నెలల క్రితమే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు. -
మహేష్ బ్యాంక్ చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ ఏఎస్ నగర్‌లోని మహేష్ కో అపరేటివ్ బ్యాంక్ చోరీ వ్యవహరం ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనాయి. బ్యాంక్‌లో చోరికి పాల్పడిన ఓ దొంగ కెమెరాకు చిక్కాడు. సీసీ కెమెరా వైర్లు కత్తిరించే ముందు అతడు సీసీ కెమెరాలో నిక్షిప్తమైయ్యాడు. ఆ క్రమంలో సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కెమెరాకి చిక్కిన దుండగుడు బ్యాంక్ సిబ్బందిలోని వ్యక్త అని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు తాళాలతో లాకర్లు తెరిచి నగలు ఎత్తుకెళ్లారని పోలీసులు నిర్థరించారు. బ్యాంకు గురించి బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారని పోలీసుల భావిస్తున్నారు