హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ..
Comments
Please login to add a commentAdd a comment