
మహేష్ బ్యాంక్ చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ ఏఎస్ నగర్లోని మహేష్ కో అపరేటివ్ బ్యాంక్ చోరీ వ్యవహరం ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనాయి. బ్యాంక్లో చోరికి పాల్పడిన ఓ దొంగ కెమెరాకు చిక్కాడు. సీసీ కెమెరా వైర్లు కత్తిరించే ముందు అతడు సీసీ కెమెరాలో నిక్షిప్తమైయ్యాడు. ఆ క్రమంలో సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కెమెరాకి చిక్కిన దుండగుడు బ్యాంక్ సిబ్బందిలోని వ్యక్త అని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు తాళాలతో లాకర్లు తెరిచి నగలు ఎత్తుకెళ్లారని పోలీసులు నిర్థరించారు. బ్యాంకు గురించి బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారని పోలీసుల భావిస్తున్నారు