ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్‌లో... | Vdeo Of Arabic Restaurant Rasalila Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్‌లో...

Published Sun, Sep 18 2022 9:42 AM | Last Updated on Sun, Sep 18 2022 9:43 AM

Vdeo Of Arabic Restaurant Rasalila Viral On Social Media - Sakshi

కదిరి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌   బాషాకు గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన షేక్షావలీకి చెందిన పట్టణంలోని అరబిక్‌ రెస్టారెంట్‌లో ఇటీవల జరిగిన రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. షేక్షావలీ తన సమీప బంధువు ఇంతియాజ్‌తో కలిసి సుమారు రెండేళ్లుగా పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో రెస్టారెంట్‌ నడుపుతున్నారు.

ఇందులోని రిసెప్షన్‌కు ఎదురుగా వెయిటింగ్‌ హాల్లో కొద్దిరోజుల క్రితం 18 ఏళ్లలోపు యువతితో 30 ఏళ్ల వయసున్న యువకుడు జరిపిన రాసలీలల వ్యవహారం కాస్త ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యం జన రద్దీ ఉండే బైపాస్‌రోడ్డులోని ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనే ఈ వ్యవహారం జరగడంతో పట్టణంలోనే కాదు..ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

రంగంలోకి పోలీసులు.. 
అరబిక్‌ రెస్టారెంట్‌లో ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ రెస్టారెంట్‌లోనే పని చేసే ఓ వ్యక్తి ఈ దృశ్యాలను బయట పెట్టినట్లు హోటల్‌ యాజమాన్యం భావిస్తోంది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో రద్దీ లేని సమయంలో ఇది జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. విషయం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యువతి కదిరి పట్టణానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణకు వచ్చారు.   

కందికుంటకు సన్నిహితుడు ..
అరబిక్‌ రెస్టారెంట్‌ నిర్వహించే షేక్షావలీ అత్తార్‌ చాంద్‌బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు గన్‌మెన్‌గా పనిచేశారు. షేక్షా వ్యవహారాలు నచ్చక అత్తార్‌ ఆయన్ను దూరం పెట్టారు. తర్వాత ఆయన విధులకు దీర్ఘకాలిక సెలవు పెట్టి కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ చెంత చేరారు. 2019 ఎన్నికల సమయంలో కందికుంటకు అన్నివిధాలా సహకరించారు. అలాగే ఆయన పట్టణంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

పోలీసులకు ఫిర్యాదు చేశాం 
మా రెస్టారెంట్‌లో అది జరిగి చాలా రోజులైంది. దీనిపై ఈ మధ్యే పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. మా హోటల్‌లో పని చేస్తూ ఇటీవల వెళ్లిపోయిన ఓ వ్యక్తి కారణంగానే ఇది బయటకొచ్చినట్లు అనుమానంగా ఉంది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా అది మా రెస్టారెంట్‌లోనే జరిగిందని ఒప్పుకుంటున్నాం.    
– ఇంతియాజ్,  రెస్టారెంట్‌ ఓనర్‌   

(చదవండి: హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్ల పట్టుకుని ఈడ్చుకెళ్లి...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement