family restaurant
-
కొల్లూరులో రెస్టారెంట్ ధ్వంసం
కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరులో ఈనాడు గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, రెస్టారెంట్ నిర్వాహకుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్ ఆదివారం అర్ధరాత్రి రెస్టారెంట్ నిర్వాహకులకు రెండు పర్యాయాలు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించారు. అంతేగాక రెస్టారెంట్ ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు.అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం నిర్వాహకులు వచ్చి చూసే సరికి రెస్టారెంట్ ధ్వంసమై కనిపించింది. దీంతో నిర్వాహకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తెనాలి–రేపల్లె రహదారిపై కొల్లూరు బస్టాండ్ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గతంలో మద్యం దుకాణాల టెండర్ల సమయంలో ఇదే టీడీపీ నేత తాము వేసిన రూ.4 లక్షలు విలువ చేసే రెండు టెండర్ల డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకుడు గిరికుమార్స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు చెప్పారు. -
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
సిద్దిపేటలో ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’
భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మామూలుగా అయితే మనుషులు (వెయిటర్లు) ఆహారాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు వడ్డిస్తారు. కానీ ఇక్కడ రోబోలే స్వాగతం పలుకుతాయి. మనతో మాట్లాడి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాయి. ఆర్డర్ చేశాకా ఆ ఫుడ్‌ను ప్లేట్లో రోబోలే పట్టుకొస్తాయి. ఇది ఎక్కడో కాదు సిద్దిపేట పట్టణం కరీంనగర్ రోడ్డులో ఇటీవలె ప్రారంభమైన ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’. ఈ హోటల్ యజమాని తీసుకొచి్చన వినూత్న ఆలోచనకు భోజన ప్రియులు ఆకర్షితులవుతున్నారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్లో రెండు రోబోలను హైదరాబాద్ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్ ఆర్డర్ చేయండి సార్ అని పలుకుతుంది. మనకు నచి్చన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ఫ్లేట్లో కస్టమర్ కూర్చున్న టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్ అని చెబుతుంది. ఆడుకోవడానికి గేమ్స్ జోన్.. ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీకెండ్లో తాకిడి ఎక్కువ.. ఈ రెస్టారెంట్లో ఇతర హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్ చేసిన హోటల్‌కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్, నాన్‌వెజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కస్టమర్లు హోటల్‌కు క్యూ కడుతున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సిద్దిపేటలో రోబో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారని తెలిసి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వచ్చాం. ఫుడ్ ఆర్డర్ చేస్తే రోబోలు భోజనం తీసుకురావడం, అవి మాట్లాడడం డిఫరెంట్‌గా ఉంది. పిల్లలు రోబోలతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపు తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి రావడం సంతోషంగా ఉంది. – మేఘన, గృహిణి, సిద్దిపేట వినూత్న ఆలోచనతో.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా హోటల్లో రోబోలను ఏర్పా టు చేశాం. వాటితో భోజనం సప్లయ్ చేయిస్తున్నాం. రూ.6 లక్షల విలువ గల రెండు రోబోలను పెట్టి వాటి సాయంతో కస్టమర్లకు వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నాం. చార్జింగ్ బ్యాటరీల సాయంతో రోబోలు పని చేస్తాయి. హోటల్లో పనిచేసే వారు వీటిని ఆపరేట్ చేస్తారు. – సతీష్ రెస్టారెంట్ నిర్వాహకులు -
‘అరబిక్’లో అశ్లీలంపై కేసు
సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్లో జరిగిన రాసలీలలపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘రెస్టారెంట్లో రాసలీలలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పట్టణ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆ రెస్టారెంట్లో జరిగిన రాసలీలలకు సంబంధించిన సీసీ పుటేజ్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరినీ ప్రేమ జంటగా నిర్ధారించారు. పట్టణంలో కదిరి–అనంతపురం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు మాయమాటలు చెప్పి రెస్టారెంట్‌కు తీసుకెళ్లి తనకు తెలియకుండా సీసీ కెమెరాలో బంధించి, తనను మోసగించాడని ఆ యువతి పోలీసుల ఎదుట వాపోయినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే పోలీసులు సదరు రెస్టారెంట్ నిర్వాహకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: (ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో...) -
ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో...
కదిరి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన షేక్షావలీకి చెందిన పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్లో ఇటీవల జరిగిన రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షేక్షావలీ తన సమీప బంధువు ఇంతియాజ్‌తో కలిసి సుమారు రెండేళ్లుగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇందులోని రిసెప్షన్‌కు ఎదురుగా వెయిటింగ్ హాల్లో కొద్దిరోజుల క్రితం 18 ఏళ్లలోపు యువతితో 30 ఏళ్ల వయసున్న యువకుడు జరిపిన రాసలీలల వ్యవహారం కాస్త ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యం జన రద్దీ ఉండే బైపాస్‌రోడ్డులోని ఫ్యామిలీ రెస్టారెంట్లోనే ఈ వ్యవహారం జరగడంతో పట్టణంలోనే కాదు..ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. రంగంలోకి పోలీసులు.. అరబిక్ రెస్టారెంట్లో ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ రెస్టారెంట్లోనే పని చేసే ఓ వ్యక్తి ఈ దృశ్యాలను బయట పెట్టినట్లు హోటల్ యాజమాన్యం భావిస్తోంది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రెస్టారెంట్లో రద్దీ లేని సమయంలో ఇది జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. విషయం పట్టణ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యువతి కదిరి పట్టణానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణకు వచ్చారు. కందికుంటకు సన్నిహితుడు .. అరబిక్ రెస్టారెంట్ నిర్వహించే షేక్షావలీ అత్తార్ చాంద్‌బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు గన్‌మెన్‌గా పనిచేశారు. షేక్షా వ్యవహారాలు నచ్చక అత్తార్ ఆయన్ను దూరం పెట్టారు. తర్వాత ఆయన విధులకు దీర్ఘకాలిక సెలవు పెట్టి కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెంత చేరారు. 2019 ఎన్నికల సమయంలో కందికుంటకు అన్నివిధాలా సహకరించారు. అలాగే ఆయన పట్టణంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం మా రెస్టారెంట్లో అది జరిగి చాలా రోజులైంది. దీనిపై ఈ మధ్యే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. మా హోటల్లో పని చేస్తూ ఇటీవల వెళ్లిపోయిన ఓ వ్యక్తి కారణంగానే ఇది బయటకొచ్చినట్లు అనుమానంగా ఉంది. ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా అది మా రెస్టారెంట్లోనే జరిగిందని ఒప్పుకుంటున్నాం. – ఇంతియాజ్, రెస్టారెంట్ ఓనర్ (చదవండి: హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్ల పట్టుకుని ఈడ్చుకెళ్లి...) -
పట్టపగలు దోపిడీ
అనంతపురం క్రైం/గుత్తి/తాడిపత్రి/కంబదూరు, న్యూస్‌లైన్ : అనంతపురం నగరంలో ఆదివారం పట్టపగలే ఓ ఇంట్లోకి దొంగ జొరబడి దోపిడీకి పాల్పడ్డాడు. గుత్తి, తాడిపత్రి, కంబదూరు మండలం రాంపురంలో దొంగలు యథేచ్ఛగా చోరీలకు తెగపడ్డారు. దొంగలు చెలరేగిపోతున్నా.. పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయి. గస్తీ పకడ్బంధీగా నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న రుచి ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని రమణ ఇంట్లో ఆదివారం ఉదయం దొంగ చొరబడి రూ.లక్ష నగదుతో పాటు 30 తులాల బంగారు నగలు దోచుకెళ్లాడు. బాధితుల కథనం మేరకు... రమణ ఉదయం 10.45 గంటలకు కుమార్తె దీక్షితకు పల్స్‌పోలియో చుక్కలు వేయించేందుకు బయటకెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య లహరి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ‘మేడమ్.. సార్ ఏసీ రిపేరీ ఉందని చెప్పాడు. ఎక్కడుందో చూపించండి’ అంటూ లోనికి దూసుకొచ్చేశాడు. వెంటనే గృహిణి జుట్టు పట్టుకుని, ఆమె మెడపై పిడిబాకును పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. దీంతో ఆమె బెంబేలెత్తిపోయింది. అనంతరం ఆమెతోనే బీరువా తెరిపించి 30 తులాల బంగారు ఆభరణాలను, లక్ష రూపాయల నగదును తీసుకున్నాడు. ఈ క్రమంలో జుట్టును విడిపించుకునేందుకు లహరి ప్రయత్నించగా ఆ వ్యక్తి పిడిబాకుతో తలపై మోదాడు. దీంతో ఆమెకు కళ్లు తిరిగినట్టయ్యి.. నోట మాటరాలేదు. పని ముగించుకుని ఆ వ్యక్తి బైక్‌పై బయల్దేరగా.. అదే సమయంలో రమణ కుమార్తెతో తిరిగి వచ్చాడు. అయితే షాక్ నుంచి కోలుకోని లహరి వెంటనే విషయాన్ని చెప్పలేకపోయింది. జుట్టు చిందరవందరగా ఉండటంతో ఏమైందని రమణ ఆరా తీస్తుండగా ఆమె భయంతో కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న లహరి జరిగిన విషయాన్ని వివరించింది. అనంతరం దంపతులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించారు. డీఎస్పీ నాగరాజతో పాటు సీసీఎస్ సీఐ ఏ.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఆత్మకూరు సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐలు శ్రీనివాసులు, ధరణీకిషోర్, జాకీర్‌హుస్సేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు ఆరా తీశారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. కేసును సవాల్‌గా తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దోపిడీకి పాల్పడిన అగంతకుడు నీలిరంగు టీషర్ట్, జీన్ ప్యాంట్, నల్లరంగు టోపీ ధరించి, 22 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉంటాడని బాధితురాలు లహరి పోలీసులకు వివరించింది. కాగా ఈ చోరీపై పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వ్యక్తి ఆధ్వర్యంలోనే చోరీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంటి యజమాని బయటకు వెళ్లిన అనంతరం లహరి ఒంటరిగా ఉండే సమయాన్ని చూసుకుని దొంగ జొరబడడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాంపురంలోనూ పట్టపగలే చోరీ కంబదూరు మండల పరిధిలోని రాంపురం గ్రామంలో చిన్నగోవిందప్ప ఇంటిలో ఆదివారం పట్టపగలే ఆగంతకులు చోరీ చేసి రూ.63 వేలు విలువైన సొత్తు చోరీ చేశారు. ఎస్ఐ నారాయణయాదవ్, బాధితుడు తెలిపిన మేరకు.. రోజువారీ పనుల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ఇంటికి తలుపులు వే సి కుటుంబ సభ్యులంతా వ్యవసాయ తోటలోకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి పైభాగంలో పెంకుల్ని తొలగించిన దొంగలు లోపలకు ప్రవేశించి బీరువా పగులగొట్టారు. అందులోని రూ. 5 వేల నగదు, 2 తులాల బంగారు చైను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుత్తిలో 9 ఇళ్లల్లో చోరీ గుత్తి పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటాక దొంగలు తాళం వేసి ఉన్న 9 ఇళ్లల్లో చోరీ చేశారు. సీపీఐ కాలనీలో ఉపాధి హామీ పథకం ఏపీఓ మద్దిలేటి, బచ్చిరెడ్డి, సంజమ్మల ఇళ్ల తలుపులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాల్లో ఉన్న చీరలు, కొన్ని విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. గాంధీనగర్‌లో జనార్ధన్, రంగస్వామితోపాటు మరో వ్యక్తి ఇళ్లలోనూ, కుమ్మర వీధిలో ఒక ఇల్లు ఉప్పర వీధిలో మరో రెండు ఇళ్లలోనూ చోరీకి విఫలయత్నం చేశారు. బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో చీరలు తదితర వస్తువులను ఎత్తుకెళ్లారు. తాడిపత్రిలో తాళం వేసిన ఇంట్లో చోరీ తాడిపత్రిలోని విజయనగర్‌కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటి యజమాని శశికళ తన కుమార్తెను చూసేందుకు 20 రోజుల క్రిత ం హైదరాబాద్‌కు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ క్రమంలో శనివారం రాత్రి దొంగలు ఈ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి ఇంటి యజమానురాలికి ఫోన్లో సమాచారమందించారు. పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని పరివీలించారు. బాధితురాలు ఆదివారం సాయంత్రం తాడిపత్రికి చేరుకుని ఇంట్లో చోరీకి గురైన వస్తువులను పరిశీలించారు. బీరువాలో పెట్టిన రూ.90 వేల నగదు, 10 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.