ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పటికీ కొందరు మృగాల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్లోనిధోల్పుర్లో ఓ దళిత మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బాధితురాలిని, ఆమె పిల్లలను తుపాకీతో బెదిరించి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. వారంతో బాధిత మహిళ గ్రామానికే చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాకూర్, ధన్ సింగ్ ఠాకూర్, విపిన్ ఠాకూర్, లోకేంద్ర సింగ్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment