మహిళపై 12మంది గ్యాంగ్‌ రేప్‌  | Women Molested By 12 Members In Nizamabad | Sakshi
Sakshi News home page

మహిళపై 12మంది గ్యాంగ్‌ రేప్‌ 

Published Wed, Aug 26 2020 6:43 AM | Last Updated on Wed, Aug 26 2020 10:06 AM

Women Molested By 12 Members In Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిజామాబాద్‌ ‌: ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. క్షతగాత్రురాలిని ఆమె సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. పని నిమిత్తం సోమవారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్‌ సమీపంలోకి వెళ్లింది. ఒంటరిగా ఉన్న సదరు మహిళను చూసిన విక్కీ అనే యువకుడు మాట కలిపాడు.

డబ్బులు అవసరం ఉందని చెప్పడంతో తాను ఇస్తానని నమ్మబలికి.. కలెక్టరేట్‌ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌కు సంబంధించిన ఖాళీ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ లోపు విక్కీ స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకుని ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడాన్ని గమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి వేళ అచేతనంగా కనిపించిన బాధితురాలిని పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రశ్నించగా.. జరిగిన దారుణం గురించి తెలిపింది. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ çఘాతుకానికి పాల్పడింది నగరంలోని హమాల్‌వాడీకి చెందిన యువకులని.. విక్కీ పెయింటర్‌గా పని చేస్తాడని వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. అయితే, పెట్రోలింగ్‌ సిబ్బంది సమాచారం మేరకు 8 మంది అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement