టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీరా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అధిక పని భారం కారణంగా చమీరాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి పనిభారాన్ని తగ్గించాలని వైద్య బృందం శ్రీలంక క్రికెట్ బోర్డుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు చమీరాను కేవలం వైట్-బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడించాలని కూడా వైద్య బృందం సూచించినట్లు సమాచారం. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కూడా చమీరా దూరమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. ఇందులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా చమీరాను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక కూడా దూరం కానున్నాడు.
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment