Kasun Rajitha
-
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్‌లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
తుస్సుమన్న విధ్వంసకర ప్లేయర్లు.. రాణించిన టిమ్ సీఫర్ట్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిర్ణీత 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. టైటాన్స్ బౌలర్లు కసున్ రజిత (4-0-20-4), లహీరు కుమార (4-1-13-2), తబ్రేజ్ షంషి (4-0-19-2), షకీబ్ అల్ హసన్ (4-0-13-1) ధాటికి జాఫ్నా విధ్వంసకర బ్యాటర్లంతా తేలిపోయారు. The three-time LPL champions are bundled out for 89!#LPL2023 #LiveTheAction pic.twitter.com/0VyIVmdp3c — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 రహ్మానుల్లా గుర్బాజ్ (0), క్రిస్ లిన్ (4), షోయబ్ మాలిక్ (0), డేవిడ్ మిల్లర్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జాప్నా ఇన్నింగ్స్‌లో దునిత్ వెల్లలగే (22), తిసార పెరీరా (13), తక్షణ (13 నాటౌట్), మధుశంక (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. There’s no stopping a true champ! It’s a Seifert-masterclass!#LPL2023 #LiveTheAction pic.twitter.com/PRP2Y8UMdy — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైటాన్స్.. 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. భానుక రాజపక్ష 15, చాడ్ బోవ్స్ 13, షకీబ్ 2, షకన 2 పరుగులు చేశారు. జాఫ్నా బౌలర్లలో మధుశంక, తీక్షణ, షోయబ్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. They held nothing back. The Titans crush the defending champs!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8inlxnSZyT — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 -
Ind Vs SL: హుడా.. మరీ ఇంత అసభ్యంగా మాట్లాడతావా? ఇది ఊహించలేదు!
India vs Sri Lanka, 1st T20I- Deepak Hooda: స్వదేశంలో.. కొత్త సంవత్సరం శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్... రాణిస్తారనుకున్న వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడం.. 11–15 ఓవర్ల మధ్య కేవలం 26 పరుగులే! అప్పటికే నాలుగు వికెట్లు చేజారాయి.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకుంటాడనుకుంటే.. 29 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌ను దిల్షాన్ మధుషంక పెవిలియన్‌కు పంపాడు. హుడా, అక్షర్ సూపర్ అప్పటికి టీమిండియా స్కోరు 94/5. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్పిన్ ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 23 బంతుల్లో హుడా 41 పరుగులతో, 20 బంతుల్లో 31 పరుగులతో అక్షర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 162 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంక ఆఖర్లో తడబడటంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవసరమైన సమయంలో జట్టును ఆదుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. That's that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series. Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y — BCCI (@BCCI) January 3, 2023 మరీ ఇంత నీచంగా మాట్లాడతావా? అయితే, అదే సమయంలో అంపైర్‌తో అనుచిత ప్రవర్తన కారణంగా దీపక్ హుడాపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఇదే నేర్పించారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో కసున్ రజిత ఐదో బంతిని అవుట్‌సైడ్ దిశగా వేయగా.. తొలుత షాట్ ఆడాలనుకున్న హుడా.. దానిని వదిలేశాడు. ఈ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటిస్తాడనుకున్నాడు. కానీ అలా జరుగలేదు. అప్పటికే లో స్కోరింగ్ (133-5)నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న హుడా.. అంపైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అతడితో వాదనకు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో హుడా ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు మాత్రం అంపైర్ ఇందుకు అర్హుడే అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి Deepak Hooda abused the umpire for not giving wide 😂 he said 'BKL' . Man is turning furious in every way #INDvSL pic.twitter.com/COV1IArJ0f — Akshat (@AkshatOM10) January 3, 2023 -
ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు స్టార్ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే..
Sri Lanka vs Afghanistan ODI Series: శ్రీలంక యువ ఆటగాళ్లు చరిత్ అసలంక, కసున్ రజిత, పాతుమ్ నిసాంక అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. ఈ ముగ్గురూ ఒకేరోజు వివాహ బంధంలో అడుగుపెట్టారు. కొలంబోలోని వేర్వేరు వేదికల్లో సోమవారం తమ పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు. కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా అఫ్గనిస్తాన్‌తో శ్రీలంక ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య లంక ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని దసున్ షనక సేన భావిస్తోంది. కాగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో అసలంక, నిసాంక, రజిత ఆడటం విశేషం. ఆ మరుసటి రోజే ఇలా ఈ ముగ్గురూ తమ ప్రియురాళ్ల వేలికి ఉంగరం తొడిగి వైవాహిక బంధాన్ని మొదలుపెట్టడం గమనార్హం. ఇక జట్టులో కీలక సభ్యులైన అసలంక, నిసాంక, రజిత.. పల్లెకెలోలో జరుగనున్న మూడో వన్డేలోనూ జట్టులో ఆడే అవకాశం ఉంది. బ్యాటర్, ఆల్‌రౌండర్, బౌలర్! 24 ఏళ్ల పాతుమ్ నిసాంక లంక ఓపెనర్‌గా రాణిస్తుండగా.. 25 ఏళ్ల చరిత్ అసలంక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇక 29 ఏళ్ల కసున్ రజిత పేస్ దళంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు పెళ్లి బంధంలో అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈ మూడు జంటల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్ Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022 -
T20 WC 2022: చమీరా ఔట్.. మూడేళ్ల తర్వాత శ్రీలంక పేసర్ రీఎంట్రీ
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్మెంట్స్ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది. చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్ -
ఎంత పని చేశావ్.. లంక జట్టులో మరో 'హసన్ అలీ'
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (408 బంతుల్లో 160 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. షఫీక్‌కు తోడూ బాబర్ ఆజం అర్థ సెంచరీతో రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అబ్దుల్లా షఫీక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లంక ఆటగాడు కాసున్ రజిత జారవిడవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసిల్వా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి బ్యాట్ ఎడ్జ్ తాకడంతో గాల్లోకి లేచింది. బౌండరీలైన వద్ద ఉన్న కాసున్ రజిత అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ పట్టడం వల్ల కూడా లంకకు పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఎందుకుంటే అప్పటికి పాక్ విజయానికి 19 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కానీ కాసున్ రజితను మాత్రం అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. అతన్ని పాక్ క్రికెటర్ హసన్ అలీతో పోల్చారు. కీలక సమయంలో క్యాచ్‌లను జారవిడుస్తాడన్న అపవాదును హసన్ అలీ ఇంతకముందు చాలాసార్లు మూటగట్టుకున్నాడు. టి20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్ వద్ద ఉన్న హసన్ అలీ చేతిలోకి వచ్చినప్పటికి అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే ఆ తర్వాత మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఆసీస్‌ను ఫైనల్ చేర్చాడు. అలా ఆరంభం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్తాన్.. హసన్ అలీ వదిలేసిన ఒక్క క్యాచ్ వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో హసన్ అలీ క్యాచ్‌లు జారవిడిచాడు. తాజాగా లంకతో తొలి టెస్టులోనూ హసన్ అలీ ఇదే సీన్‌ను రిపీట్ చేశాడు. రెండు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు సింపుల్ రనౌట్ చేసే చాన్స్‌ను కూడా మిస్ చేశాడు. తాజాగా కాసున్ రజితను కూడా హసన్ అలీతో పోలుస్తూ అభిమానులు కామెంట్స్ చేశారు. ''హసన్ అలీ నుంచి స్పూర్తి పొందినట్లున్నాడు.. వెల్కమ్ టూ హసన్ అలీ అకాడమీ.. లంక జట్టులో హసన్ అలీని చూశాం.. క్యాచ్ పట్టినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదులే..'' అంటూ రజితను ఒక ఆట ఆడుకున్నారు. Welcome to 'Hassan Ali' academy#PAKvSL pic.twitter.com/7rsznXDpOI — Juniii... @searchingsukoon (@searchingsukoon) July 20, 2022 We found hassan ali in Srilankan team.inspired by Real Hassan Ali😜#PAKvSL #SLvPAK#PAKvsSL #SLvsPAK pic.twitter.com/5a5i3sbxNr — ḶQ 💚 🇵🇰 | 🏏 l❤️ (@Saddique_rao) July 20, 2022 #WTC23 Inspired by Hassan Ali😜#PAKvSL pic.twitter.com/QqA4KSfWOZ — Mohammad Asad (@MohammadAsad77) July 20, 2022 చదవండి: షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం -
BAN Vs SL: బంగ్లాదేశ్ 365 ఆలౌట్
Bangladesh Vs Sri Lanka Test Series 2022- ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 365 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 277/5తో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ (175 నాటౌట్; 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. ఇక లిటన్ దాస్ (141; 16 ఫోర్లు, 1 సిక్స్) తన వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతచేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత ఐదు వికెట్లు, అసిథ ఫెర్నాండో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్లకు 143 పరుగులు చేసింది. కాగా మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చదవండి👉🏾 IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో! చదవండి👉🏾Womens T20 Challenge: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్ సేనకు తప్పని పరాజయం -
టీ20 చరిత్రలో చెత్త రికార్డు
అడిలైడ్: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో రజిత నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 75 పరుగులిచ్చాడు. ఒక్క నోబాల్ సాయంతో భారీ పరుగుల్ని ఇచ్చాడు. కనీసం వికెట్ కూడా తీయకుండానే చెత్త గణాంకాల్ని నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా లిఖించబడింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో ఏ ఒక్క బౌలర్ 70కు మించి పరుగులు ఇవ్వకపోగా రజిత మాత్రం 75 పరుగులతో అపప్రథను సొంతం చేసుకున్నాడు. 18.75 ఎకానమితో రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 11 పరుగులు ఇచ్చిన రజిత.. ఐదో ఓవర్లో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 10 ఓవర్లో 25 పరుగులు.. 18 ఓవర్లో 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. 56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆది నుంచి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డ వార్నర్ చివరి వరకూ తన దూకుడు కొనసాగించాడు. కెప్టెన్ అరోన్ ఫించ్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 122 పరుగులు చేసిన తర్వాత ఫించ్ ఔటయ్యాడు. ఆపై మ్యాక్స్‌వెల్(62; 28 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఈ ముగ్గురూ ధాటికి రజిత తన బౌలింగ్ లయను కోల్పోయి చెత్త ప్రదర్శనను తన ఖాతాలో వేసుకున్నాడు.