Lanka Premier League 2023: Galle Titans Beat Jaffna Kings By 7 Wickets - Sakshi
Sakshi News home page

తుస్సుమన్న విధ్వంసకర ప్లేయర్లు.. రాణించిన టిమ్‌ సీఫర్ట్‌

Published Sun, Aug 13 2023 6:12 PM | Last Updated on Sun, Aug 13 2023 6:23 PM

Lanka Premier League 2023: Galle Titans Beat Jaffna Kings By 7 Wickets - Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 13) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా.. నిర్ణీత 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. టైటాన్స్‌ బౌలర్లు కసున్‌ రజిత (4-0-20-4), లహీరు కుమార (4-1-13-2), తబ్రేజ్‌ షంషి (4-0-19-2), షకీబ్‌ అల్‌ హసన్‌ (4-0-13-1) ధాటికి జాఫ్నా విధ్వంసకర బ్యాటర్లంతా తేలిపోయారు.

రహ్మానుల్లా గుర్బాజ్‌ (0), క్రిస్‌ లిన్‌ (4), షోయబ్‌ మాలిక్‌ (0), డేవిడ్‌ మిల్లర్‌ (5) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. జాప్నా ఇన్నింగ్స్‌లో దునిత్‌ వెల్లలగే (22), తిసార పెరీరా (13), తక్షణ (13 నాటౌట్‌), మధుశంక (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైటాన్స్‌.. 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్‌ సీఫర్ట్‌ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకంతో రాణించగా.. భానుక రాజపక్ష 15, చాడ్‌ బోవ్స్‌ 13, షకీబ్‌ 2, షకన 2 పరుగులు చేశారు. జాఫ్నా బౌలర్లలో మధుశంక, తీక్షణ, షోయబ్‌ మాలిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement