Tim Seifert
-
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్‌పై చితక్కొట్టి అరుదైన ఘనత
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.బాదుడే బాదుడు... స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్‌సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 255.26గా నమోదైంది.ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక స్ట్రైక్‌రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. లివింగ్‌స్టోన్ 2021లో పాకిస్తాన్‌పై నాటింగ్‌హామ్ వేదికగా 239.53 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి
పాకిస్తాన్‌తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్‌లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్‌డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
PAK Vs NZ: పాక్‌తో నాలుగో టీ20.. ఫిన్ అలెన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు.అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్‌ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది. ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మేల్కొలిపాడు. బ్రేస్‌వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్‌వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. ఆ ఓవర్లో బ్రేస్‌వెల్‌తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో బ్రేస్‌వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది. 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. -
Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్.. సిక్సర్ల వర్షం
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్‌గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్‌ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్‌కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
CPL 2024: రాణించిన నూర్ అహ్మద్, సీఫర్ట్
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (4-0-18-3), బ్యాటింగ్‌లో టిమ్ సీఫర్ట్ (11 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి లూసియా కింగ్స్‌ను గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్టిన్ గ్రీవ్స్ (36), ఇమాద్ వసీం (29 నాటౌట్), ఫఖర్ జమాన్ (21) పర్వాలేదనిపించారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్‌తో పాటు డేవిడ్ వీస్, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్ మెరుపు వేగంతో పరుగులు చేయగా.. జాన్సన్ ఛార్టెస్ (46 బంతుల్లో 47 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. డుప్లెసిస్ 28, రాజపక్ష 9, అకీమ్ 27 పరుగులు చేశారు. ఫాల్కన్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, క్రిస్ గ్రీన్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా రేపు సెయింట్ కిట్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకం
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో తొలి శతకం నమోదైంది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఆటగాడు ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లూయిస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో కైల్ మేయర్స్ కూడా శతకానికి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మేయర్స్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. భానుక రాజపక్స (35 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పేట్రేగిపోవడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో డేవిడ్ వీస్ (20 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఎవిన్ లూయిస్ సెంచరీతో చెలరేగినా పేట్రియాట్స్ ఓడిపోవడం గమనార్హం. -
న్యూజిలాండ్ బ్యాటర్ భారీ విన్యాసం.. వైరల్ వీడియో
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య నిన్న (ఏప్రిల్ 27) జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్ భారీ డైవ్ కొట్టాడు. సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్ మాత్రం బ్యాటింగ్‌లో డైవింగ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్ డైవిండ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది. Full stretch dive from Tim Seifert during the batting. 😂👌 pic.twitter.com/fV5n0Mh0y7— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ న్యూజిలాండ్‌ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డైవింగ్ షాట్ హీరో సీఫర్ట్ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో సీఫర్ట్ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్.. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాక్ గెలుపొందాయి. -
నిప్పులు చెరిగిన హసన్ అలీ.. టిమ్ సీఫర్ట్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. .@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M — CricTracker (@Cricketracker) March 6, 2024 గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. -
తుస్సుమన్న విధ్వంసకర ప్లేయర్లు.. రాణించిన టిమ్ సీఫర్ట్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిర్ణీత 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. టైటాన్స్ బౌలర్లు కసున్ రజిత (4-0-20-4), లహీరు కుమార (4-1-13-2), తబ్రేజ్ షంషి (4-0-19-2), షకీబ్ అల్ హసన్ (4-0-13-1) ధాటికి జాఫ్నా విధ్వంసకర బ్యాటర్లంతా తేలిపోయారు. The three-time LPL champions are bundled out for 89!#LPL2023 #LiveTheAction pic.twitter.com/0VyIVmdp3c — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 రహ్మానుల్లా గుర్బాజ్ (0), క్రిస్ లిన్ (4), షోయబ్ మాలిక్ (0), డేవిడ్ మిల్లర్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జాప్నా ఇన్నింగ్స్‌లో దునిత్ వెల్లలగే (22), తిసార పెరీరా (13), తక్షణ (13 నాటౌట్), మధుశంక (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. There’s no stopping a true champ! It’s a Seifert-masterclass!#LPL2023 #LiveTheAction pic.twitter.com/PRP2Y8UMdy — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైటాన్స్.. 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. భానుక రాజపక్ష 15, చాడ్ బోవ్స్ 13, షకీబ్ 2, షకన 2 పరుగులు చేశారు. జాఫ్నా బౌలర్లలో మధుశంక, తీక్షణ, షోయబ్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. They held nothing back. The Titans crush the defending champs!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8inlxnSZyT — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్‌దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్‌కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్ పెరెరా(35), చరిత్ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్ మదుషాన్(1), దిల్షాన్ మదుషంక(0)లను పెవిలియన్‌కు పంపాడు. మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్ మిల్నే విజృంభణతో డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్‌ను ఛేదించింది. దసున్ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతుమ్ నిసాంక బ్యాట్‌ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్ పదును చూపించాడు మిల్నే. తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా న్యూజిలాండ్- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. చదవండి: వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు 🚨 BROKEN BAT 🚨 Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni — Spark Sport (@sparknzsport) April 5, 2023 Pathum Nissanka's bat 🤯#SparkSport #NZvSL pic.twitter.com/t2cLh9w9Iq — Spark Sport (@sparknzsport) April 5, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
వీరోచిత సెంచరీ.. జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు
న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫెర్ట్ విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ససెక్స్ తరపున ఆడుతున్న టిమ్ సీఫెర్ట్ సెంచరీ(56 బంతుల్లో 100 నాటౌట్, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయింది. విషయంలోకి వెళితే.. శనివారం రాత్రి హాంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు జేమ్స్ విన్స్(65), బెన్ మెక్డొర్మెట్ 60 పరుగులతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 124 పరుగులు జత చేయడంతో హాంప్‌షైర్ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్.. టిమ్ సీఫెర్ట్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హాంప్‌షైర్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సీఫెర్ట్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సీఫెర్ట్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మధ్యలో డిల్రే రావ్లిన్స్ 32 పరుగులతో నిలదొక్కుకోవడంతో ఒక దశలో హాంప్‌షైర్ గెలుస్తుందనే ఆశలు కలిగాయి. కానీ రావ్లిన్స్ ఔట్ కావడం.. సీఫెర్ట్‌పై ఒత్తిడి పడడం జట్టు విజయాన్ని దెబ్బ తీసింది. చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Ravi Shastri Vs Javed Miandad: రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.? Runs: 1️⃣0️⃣0️⃣* Fours: 9️⃣ Sixes: 5️⃣ That is a fantastic innings from Tim Seifert 👏#Blast22 | @SussexCCC pic.twitter.com/FxRlzGYlbf — Vitality Blast (@VitalityBlast) June 4, 2022 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్..
నేడు కోల్‌కతాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట లభించింది. కరోనాతో ఆస్పత్రిపాలైన జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం అతను కోవిడ్ బారిన పడ్డాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ మరో సభ్యుడు టిమ్ సీఫెర్ట్ కూడా కరోనా నుంచి విముక్తి పొందాడు. వీరిద్దరు బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కాగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌తో అమితుమీ తేల్చుకోనుంది. -
సంచలన క్యాచ్‌తో మెరిసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్ కుల్దీప్ వేశాడు. 3 పరుగులతో ఆడుతున్న పొలార్డ్ కుల్దీప్ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి మిడ్ వికెట్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సీఫెర్ట్ పూర్తిగా తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. సీఫెర్ట్ విన్యాసం పొలార్డ్ నమ్మలేకపోయాడు. అయినా సూపర్ క్యాచ్ అందుకోవడంతో విండీస్ హిట్టర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే లలిత్ యాదవ్( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లోమెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: IPL 2022: ఏం ఆడుతున్నావని విమర్శించారు.. కట్‌చేస్తే An absolutely sensational grab by Tim Seifert to dismiss Keiron Pollard. #IPL2022 #DCvMI pic.twitter.com/jXkRxxzqEb — Dr. Mukul Kumar (@WhiteCoat_no_48) March 27, 2022 -
T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే
Tim Seifert Replace Devon Conway For T20 WC 2021 Final.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్‌కు గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ స్టీఫెర్ట్ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగనున్న టి20 సిరీస్‌కు కూడా స్టీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. ఇక టిమ్ స్టీఫెర్ట్ న్యూజిలాండ్ తరపున 36 టి20ల్లో 703 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్ ఇక నవంబర్10న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్‌ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది. దీంతో విచిత్రరీతిలో కాన్వే టి20 ప్రపంచకప్ నుంచి దూరమవ్వాల్సి వచ్చింది. చదవండి: Marnus Labuschagne: పక్కకు పోతుందని వదిలేశాడు.. మైండ్‌బ్లాక్; లబుషేన్ అద్భుతం