![IPL 2022: Marsh-Tim Seifert Recover From COVID-19 Joins Delhi Capitals - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/28/marsh.jpg.webp?itok=A8cqG6d9)
PC: IPL Twitter
నేడు కోల్‌కతాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట లభించింది. కరోనాతో ఆస్పత్రిపాలైన జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం అతను కోవిడ్ బారిన పడ్డాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ మరో సభ్యుడు టిమ్ సీఫెర్ట్ కూడా కరోనా నుంచి విముక్తి పొందాడు. వీరిద్దరు బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కాగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌తో అమితుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment