పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య నిన్న (ఏప్రిల్ 27) జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్ భారీ డైవ్ కొట్టాడు.
సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్ మాత్రం బ్యాటింగ్‌లో డైవింగ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్ డైవిండ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Full stretch dive from Tim Seifert during the batting. 😂👌 pic.twitter.com/fV5n0Mh0y7
— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ న్యూజిలాండ్‌ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డైవింగ్ షాట్ హీరో సీఫర్ట్ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో సీఫర్ట్ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్.. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాక్ గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment