Mohammed Amir
-
న్యూజిలాండ్ బ్యాటర్ భారీ విన్యాసం.. వైరల్ వీడియో
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య నిన్న (ఏప్రిల్ 27) జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్ భారీ డైవ్ కొట్టాడు. సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్ మాత్రం బ్యాటింగ్‌లో డైవింగ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్ డైవిండ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది. Full stretch dive from Tim Seifert during the batting. 😂👌 pic.twitter.com/fV5n0Mh0y7— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ న్యూజిలాండ్‌ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డైవింగ్ షాట్ హీరో సీఫర్ట్ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో సీఫర్ట్ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్.. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాక్ గెలుపొందాయి. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆ జట్టు స్టార్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు అవకాశం ఇస్తే మరోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని ఆమిర్ ఆదివారం వెల్లడించాడు. పాక్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపిన అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. మరోసారి పాక్ జట్టుకు ఎంపిక చేసే విషయంలో పీసీబీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపాడు. పాక్ జట్టుకు ఆడటం తన కల అని.. పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏ వయసులో వచ్చినా వదులుకోనని అన్నాడు. 31 ఏళ్ల ఆమిర్ 2020లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి లీగ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన ఆమిర్.. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. 17 ఏళ్ల వయసులోనే పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆమిర్.. ఆ జట్టు తరఫున 36 టెస్ట్‌లు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 259 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ వన్డేల్లో రెండు అర్దసెంచరీలు కూడా చేశాడు. ఇటీవల ఆమిర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2024 పీఎస్ఎల్లో అతను 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ముందు మరో పాక్ క్రికెటర్ కూడా రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం కోసం రిటైర్మెంట్ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. -
రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్.. కోహ్లెర్ కాడ్మోర్ (45 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్ (29 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవమన్ పావెల్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కరాచీ బౌలర్లలో మహ్మద్ అమీర్ (4-0-26-4) నిప్పులు చెరగగా.. షంషి (1/25), ఆమెర్ యామిన్ (4-1-38-0) పర్వాలేదనిపించారు. అనంతరం198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 53; 9 ఫోర్లు), ఇమాద్ వసీం (30 బంతుల్లో 57 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. పెషావర్ బౌలరల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆమెర్ జమాల్ తలో 3 వికెట్లు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2 వికెట్లు పడగొట్టారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన బాబర్ ఆజమ్ సేనను మెరుపు అర్ధశతకంతో గట్టెక్కించిన రోవమన్ పావెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 2) లాహోర్ ఖలందర్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. 17 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి లాహోర్ ఖలందర్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయలతో 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి. -
క్రికెట్లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే?
లాహోర్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అమీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇస్లామాబాద్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ అహ్మద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా అని కయ్యానికి కాలు దువ్వారు. చివరకు అంపైర్లు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Source: Sony Sports Network #PSL6 #PSL #PSL2021 #MohammadAmir #KKvsIU pic.twitter.com/61d7xKsBC5 — Cricket (@ZombieCricketer) June 14, 2021 కాగా, 29 ఏళ్ల అమీర్.. పాక్ జట్టు మేనేజ్మెంట్ మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ గతేడాది పాక్ క్రికెట్‌తో సంబంధాలు తెంచుకుని ఇంగ్లండ్‌కి వెళ్లి సెటిలయ్యాడు. అనంతరం బ్రిటీష్ సిటిజన్‌షిప్ పొందాక ఐపీఎల్లో ఆడేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పీసీబీ చీఫ్ వసీమ్ ఖాన్.. పీఎస్ఎల్ ఆడేందుకు పాక్‌కు వచ్చిన అమీర్‌తో చర్చలు ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ఇంటికి స్వయంగా వెళ్లి.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా మహ్మద్ అమీర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాపై మరోసారి అక్కసు వెల్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత.. -
ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం
కొలంబొ : శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో సోమవారం కాండీ టస్కర్స్, గాలే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ టస్కర్స్ 25 పరుగుల తేడాతో గాలే గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రత్యర్థి ఆటగాడిపై తిట్లతో విరుచుకుపడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న మహ్మద్ ఆమిర్, టస్కర్స్ బౌలర్ నవీన్ హుల్ హక్ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. నవీన్ హుల్ హక్ ఆమిర్నుద్దేశించి స్లెడ్జింజ్‌కు పాల్పడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ నవీన్వైపు దూసుకెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి తయారయ్యారు. ఇంతలో మునాఫ్ పటేల్ సహా ఇతర ఆటగాళ్లు వారిద్దరిని అడ్డుకున్నారు. (చదవండి : బంతి పట్టనున్న శ్రీశాంత్.. రైనా శుభాకాంక్షలు) మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్ కెప్టెన్ ఆఫ్రిది అందరితో సరదాగానే చేతులు కలిపాడు. తీరా నవీన్ హుల్ హక్ దగ్గరకు రాగానే ముఖం కోపంగా పెట్టి.. అతనిపై విరుచుకుపడ్డాడు. ఏమైంది నీకు.. ఎందుకు అమిర్‌తో అలా ప్రవర్తించావు. ఒక సీనియర్ బౌలర్‌పై ఈ విధంగా వ్యవహరించడం తప్పు .. అంటూ కోపంతో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కాండీ టస్కర్స్ బ్రెండన్ టేలర్, కుషాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆఫ్రిది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్పీఎల్లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. (చదవండి : సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు టీంలో లేరు..) -
ఇంగ్లండ్‌పై పాక్ జయభేరి
నాటింగ్‌హామ్ : సంచలనాల పాకిస్తాన్ చేతిలో ఇంగ్లండ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. భారీ లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తూ విజయాలను అందుకుంటున్న ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో పాక్ జయభేరి మోగించింది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాక్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గాడిలో పడింది. అన్ని విభాగాల్లో పాక్ కంటే బలంగా ఉన్నా ఆతిథ్య జట్టుదే విజయమని భావించారు. అయితే సంచలనాలకు మారుపేరు అయిన పాక్ ఇంగ్లండ్‌ను ఘోరంగా ఓడించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు సరైన శుభారంభాన్ని అందించలేదు. ఓపెనర్ జేసన్ రాయ్(8) తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం బెయిర్ స్టో(32), మోర్గాన్(9), స్టోక్స్(13)లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సమయంలో జో రూట్, బట్లర్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీర్దిదరూ స్కోర్ బోర్డు వేగం పెంచారు. అయితే జో రూట్(107; 104 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్) శతకం తర్వాత షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరికాసేపటికే శతకం చేసిన బట్లర్(103; 76 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు)ను అమిర్ బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. షాదాబ్, అమిర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫకార్ జమాన్(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్ అజామ్(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హఫీజ్ (84: 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్ అహ్మద్(55: 44 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మార్క్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. -
టీమిండియాకు పాక్ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహమ్మద్ ఆమీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత క్రికెటర్ల ప్రదర్శనపై పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు. ఏదైనా మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైతే దాదాపు సగం జట్టు ఔటైనట్లేనని, 70-80 శాతం విజయావకాశాలు ప్రత్యర్థి జట్టుకు ఉంటాయని అభిప్రాయపడ్డాడు పాక్ క్రికెటర్. ఇంకా చెప్పాలంటే టీమిండియా మొత్తం కోహ్లీ సాధించే పరుగులపైనే ఆధారపడుతుందని, భవిష్యత్తులో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇకనైనా మేలుకుని జట్టు ఆటగాళ్లు తమ వంతు పాత్ర నిర్వహించకపోతే టీమిండియాకు విపత్కర పరిస్థితులు తప్పవన్నాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన కోహ్లీని సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలి. కోహ్లీని ఔట్ చేస్తే దాదాపు సగం భారత జట్టును పెవిలియన్ బాట పట్టించినట్లే. కోహ్లీ వన్ మ్యాన్ షోల కారణంగా భారత్ విజయాలు సాధిస్తుంది. ఒకవేళ కోహ్లీ క్యాచ్ మిస్ చేశారంటే ప్రత్యర్థి జట్టు ఓటమిని ఆహ్వానించడమే అవుతుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల స్కోరు లోపే ఉన్న సమయంలో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో అతడు సులువుగా శతకం సాధించాడని’ పాక్ పేసర్ వివరించాడు. చాంపియన్స్ ట్రోఫీ- 2017 ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడగా పాక్ బౌలర్ ఆమీర్ టీమిండియా కెప్టెన్ కోహ్లీని త్వరగా ఔట్ చేశాడు. దీంతో భారత్ 100కు పైగా పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
క్రికెటర్ ప్రేమ పెళ్లి
లాహార్: పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ ఓ ఇంటివాడయ్యాడు. బ్రిటీష్-పాకిస్థాని యువతి నర్జిస్ ను అతడు పెళ్లాడాడు. మంగళవారం లాహోర్ లో జరిగిన వీరి వివాహానికి పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. సోమవారం మెహందీ వేడుక నిర్వహించారని స్థానిక మీడియా వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో రిసెప్షన్, వలీమా ఏర్పాటు చేశారని తెలిపింది. ఆరేళ్ల క్రితం ఆమిర్ ను లండన్ లో నర్జిస్ కలిసింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఆమోదం తెలిపి 2014లో నిశ్చితార్థం జరిపారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆమిర్ ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్నా నర్జిత్ అతడినే పెళ్లాడింది. తనది ప్రేమ వివాహం అని, తమ పెళ్లికి ఇరు కుటుంబాలు సంతోషంగా అంగీకరించాయని ఆమిర్ తెలిపాడు. ఆమిర్, నర్జిజ్ లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. -
'ఆమిర్ జీవితాన్ని గుణపాఠంగా తీసుకోండి'
ముంబై: అంతర్జాతీయ మ్యాచ్‌లో ఫిక్సింగ్ కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ మొహ్మద్ ఆమిర్ జీవితాన్ని యువ క్రికెటర్లు ఓ గుణపాఠం తీసుకోవాలని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమిర్ పై రూపొందించిన వీడియోను ఏసీయూ అవినీతి నిరోధక శాఖ రూపొందించింది. మరో రెండు రోజుల్లో భారత్‌లో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాన్ని ఏసీయూ చైర్మన్ సర్ రోనీ ఫ్లనాగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమిర్ క్రికెట్ జీవితాన్ని ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. 'ఆమిర్ క్రికెట్ జీవితంలో చేసిన తప్పులతో కష్టాలు తెచ్చుకున్నాడు. తద్వారా మూడు నెలల జైలు జీవితంతో పాటు, ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆమిర్ జైలు నుంచి వచ్చిన తరువాత అతనిపై రూపొందించిన వీడియోను చాలాసార్లు మీకు పరిచయం చేశాం. మేము అవినీతిపై చేసే పోరాటంలో ఆమిర్ వీడియో చేసే అవకాశాన్ని కల్పించాడు. ఎవరైనా తప్పు చేసిన తరువాత ఒప్పుకోవడం కూడా ముఖ్యమైనదే. ఆమిర్ తప్పుచేసి, బహిరంగంగా క్షమాపణలు కోరాడు. దీనివల్ల ఫిక్సింగ్ తరహా ఘటనలను ఎంతో కొంత నిరోధించవచ్చు. ఆమిర్ పై వీడియోను క్రికెటర్లకు చూపిస్తాం. మన లక్ష్యం అవినీతిని రూపుమాపడం. ఇందుకోసం ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో సహా అంతా సహకరించాలి. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఎవరైనా నేరానికి పాల్పడినట్లు ఆటగాళ్లకు, అధికారులకు తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. ఒకవేళ అలా చేయకపోతే మీరు అవినీతిలో భాగం పంచుకున్నవారవుతారు. దీనికోసం మా హాట్‌లైన్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి' అని ఫ్లనాగన్ పేర్కొన్నారు. ఇటీవల మొహ్మద్ ఆమిర్ పాకిస్తాన్ జాతీయ జట్టులో పునరాగమనం చేసిన తెలిసిందే. 2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఆమిర్‌తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం బారినపడ్డారు. -
క్రికెటర్ ఆమిర్‌పై ప్రశంసల వర్షం
మిర్పూర్: ఆసియాకప్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైనా ఆ దేశ పేస్ బౌలర్ మొహ్మద్ ఆమిర్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. 84 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ను ఆదిలో గడగడలాడించిన ఆమిర్ ను అటు పాకిస్తాన్ కోచ్ వకార్ యూనిస్‌తో పాటు, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అభినందించారు. ఆమిర్ ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని వకార్ స్పష్టం చేశాడు. మ్యాచ్-మ్యాచ్‌కు ఆమిర్ మరింత రాటుదేలుతున్నాడన్నాడు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్‌తో జట్టుకు ఐదేళ్లపాటు దూరం కావడం అతని చేసి తప్పిదం కారణంగానే జరిగిందని వకార్ పేర్కొన్నాడు. అప్పుడు ఆమిర్ ఏదైతే చేశాడో దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడన్నాడు. మరోవైపు లెంగ్త్‌తో కూడుకున్నఆమిర్ బౌలింగే అతనికి బలమని ధోని స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా ఆమిర్ ఫుల్ లెంగ్త్ బంతులను వేసిన తీరు అబ్బురపరిచిందన్నాడు. పూర్తి నియంత్రణతో ఆమిర్ బౌలింగ్ చేయడం అతని అడ్వాంటేజ్‌గా పరిగణించిందన్నాడు. ఆమిర్ తో పాటు మహ్మద్ సమీ కూడా సరైన లెంగ్త్‌లో బంతులు విసిరడంతో భారత్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సివచ్చిందని ధోని తెలిపాడు. అయితే మహ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్‌లు మాత్రం ఫుల్ లెంగ్త్ బంతులను వేయలేకపోయారన్నాడు. కనీసం స్వింగ్ రాబట్టడంలో కూడా రియాజ్-ఇర్ఫాన్‌లు విఫలం చెందారని ధోని పేర్కొన్నాడు.