న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహమ్మద్ ఆమీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత క్రికెటర్ల ప్రదర్శనపై పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు. ఏదైనా మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైతే దాదాపు సగం జట్టు ఔటైనట్లేనని, 70-80 శాతం విజయావకాశాలు ప్రత్యర్థి జట్టుకు ఉంటాయని అభిప్రాయపడ్డాడు పాక్ క్రికెటర్. ఇంకా చెప్పాలంటే టీమిండియా మొత్తం కోహ్లీ సాధించే పరుగులపైనే ఆధారపడుతుందని, భవిష్యత్తులో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇకనైనా మేలుకుని జట్టు ఆటగాళ్లు తమ వంతు పాత్ర నిర్వహించకపోతే టీమిండియాకు విపత్కర పరిస్థితులు తప్పవన్నాడు.
‘ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన కోహ్లీని సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలి. కోహ్లీని ఔట్ చేస్తే దాదాపు సగం భారత జట్టును పెవిలియన్ బాట పట్టించినట్లే. కోహ్లీ వన్ మ్యాన్ షోల కారణంగా భారత్ విజయాలు సాధిస్తుంది. ఒకవేళ కోహ్లీ క్యాచ్ మిస్ చేశారంటే ప్రత్యర్థి జట్టు ఓటమిని ఆహ్వానించడమే అవుతుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల స్కోరు లోపే ఉన్న సమయంలో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో అతడు సులువుగా శతకం సాధించాడని’ పాక్ పేసర్ వివరించాడు.
చాంపియన్స్ ట్రోఫీ- 2017 ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడగా పాక్ బౌలర్ ఆమీర్ టీమిండియా కెప్టెన్ కోహ్లీని త్వరగా ఔట్ చేశాడు. దీంతో భారత్ 100కు పైగా పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment