PSL 2023: Peshawar Zalmi Beat Karachi Kings By 24 Runs - Sakshi
Sakshi News home page

PSL 2023: రోవమన్‌ పావెల్‌ ఊచకోత.. బాబర్‌ సేన ఘన విజయం

Published Thu, Mar 2 2023 6:57 AM | Last Updated on Thu, Mar 2 2023 8:55 AM

PSL 2023: Peshawar Zalmi Beat Karachi Kings By 24 Runs - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో పెషావర్‌ జల్మీ జట్టు 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ టీమ్‌.. కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (45 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్‌ (29 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవమన్‌ పావెల్‌ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

కరాచీ బౌలర్లలో మహ్మద్‌ అమీర్‌ (4-0-26-4) నిప్పులు చెరగగా.. షంషి (1/25), ఆమెర్‌ యామిన్‌ (4-1-38-0) పర్వాలేదనిపించారు. అనంతరం​198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాథ్యూ వేడ్‌ (41 బంతుల్లో 53; 9 ఫోర్లు), ఇమాద్‌ వసీం (30 బంతుల్లో 57 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు.

పెషావర్‌ బౌలరల్లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ఆమెర్‌ జమాల్‌ తలో 3 వికెట్లు, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ 2 వికెట్లు పడగొట్టారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన బాబర్‌ ఆజమ్‌ సేనను మెరుపు అర్ధశతకంతో గట్టెక్కించిన రోవమన్‌ పావెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 2) లాహోర్‌ ఖలందర్స్‌-క్వెట్టా గ్లాడియేటర్స్‌ తలపడనున్నాయి. 17 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి లాహోర్‌ ఖలందర్స్‌ (5 మ్యాచ్‌ల్లో 4 విజయలతో 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముల్తాన్‌ సుల్తాన్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, పెషావర్‌ జల్మీ, కరాచీ కింగ్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌ వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement