
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది.
.@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M
— CricTracker (@Cricketracker) March 6, 2024
గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment