జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG
— ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023
అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు.
Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr
— ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023
Comments
Please login to add a commentAdd a comment