జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు.
నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు.
కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్‌మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్‌ను గెలిపించాడు.
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు.
కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment