సంచలన క్యాచ్‌తో మెరిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు | Tim Seifert Grabs Stunning Catch Shocks Kieron Pollard Viral | Sakshi
Sakshi News home page

IPL 2022: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు

Published Sun, Mar 27 2022 10:01 PM | Last Updated on Sun, Mar 27 2022 10:14 PM

Tim Seifert Grabs Stunning Catch Shocks Kieron Pollard Viral - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు టిమ్‌ సీఫెర్ట్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ కుల్దీప్‌ వేశాడు. 3 పరుగులతో ఆడుతున్న పొలార్డ్‌ కుల్దీప్‌ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి మిడ్‌ వికెట్‌ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న సీఫెర్ట్‌ పూర్తిగా తన ఎడమవైపుకు డైవ్‌ చేస్తూ రెండు చేతులతో సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. సీఫెర్ట్‌ విన్యాసం పొలార్డ్‌ నమ్మలేకపోయాడు. అయినా సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో విండీస్‌ హిట్టర్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే లలిత్‌ యాదవ్‌( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లో​మెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: IPL 2022: ఏం ఆడుతున్నావని విమర్శించారు.. కట్‌చేస్తే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement