3 Sri Lankan cricketers get married in the middle of series on same day - Sakshi
Sakshi News home page

SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్‌ ఆడుతూనే..

Published Tue, Nov 29 2022 9:08 AM | Last Updated on Tue, Nov 29 2022 10:14 AM

SL Vs AFG: 3 Sri Lankan Cricketers Get Married On Same Day Middle Of Series - Sakshi

కసున్‌ రజిత, పాతుమ్‌ నిసాంక, చరిత్‌ అసలంక జంటలు (PC: Sri Lanka Cricket)

Sri Lanka vs Afghanistan ODI Series: శ్రీలంక యువ ఆటగాళ్లు చరిత్‌ అసలంక, కసున్‌ రజిత, పాతుమ్‌ నిసాంక అభిమానులకు స్వీట్‌ షాకిచ్చారు. ఈ ముగ్గురూ ఒకేరోజు వివాహ బంధంలో అడుగుపెట్టారు. కొలంబోలోని వేర్వేరు వేదికల్లో సోమవారం తమ పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు. 

కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా అఫ్గనిస్తాన్‌తో శ్రీలంక ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య లంక ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. 

మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే
ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్‌ సమం చేయాలని దసున్‌ షనక సేన భావిస్తోంది. కాగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో అసలంక, నిసాంక, రజిత ఆడటం విశేషం.

ఆ మరుసటి రోజే ఇలా ఈ ముగ్గురూ తమ ప్రియురాళ్ల వేలికి ఉంగరం తొడిగి వైవాహిక బంధాన్ని మొదలుపెట్టడం గమనార్హం. ఇక జట్టులో కీలక సభ్యులైన అసలంక, నిసాంక, రజిత.. పల్లెకెలోలో జరుగనున్న మూడో వన్డేలోనూ జట్టులో ఆడే అవకాశం ఉంది.

బ్యాటర్‌, ఆల్‌రౌండర్‌, బౌలర్‌!
24 ఏళ్ల పాతుమ్‌ నిసాంక లంక ఓపెనర్‌గా రాణిస్తుండగా.. 25 ఏళ్ల చరిత్‌ అసలంక బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇక 29 ఏళ్ల కసున్‌ రజిత పేస్‌ దళంలో సభ్యుడిగా ఉన్నాడు.

ఈ ముగ్గురు యువ క్రికెటర్లు పెళ్లి బంధంలో అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈ మూడు జంటల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8!
FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్‌ చేసి.. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌
ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement