ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రీలంక స్పీడ్‌స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్‌కు ప్రత్యామ్నాయంగా చమీరాను ఎంపిక చేసుకున్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. చమీరా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైజ్‌తో కేకేఆర్‌తో జతకట్టనున్నాడు. చమీరా 2018, 2021, 2022 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు.
చమీరా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. ఈ 32 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ శ్రీలంక తరఫున 12 టెస్ట్‌లు, 52 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓవరాల్‌గా 143 వికెట్లు పడగొట్టాడు. చమీరా ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం చమీరాకు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గట్కిన్సన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ పేసర్‌ను 2024 సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం బేస్ ధర కోటి రూపాయలకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ జట్టు..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా (గుస్ అట్కిన్సన్ రీప్లేస్‌మెంట్), సాకిబ్ హుస్సేన్
Comments
Please login to add a commentAdd a comment