Ind Vs Sl 2nd Test: Fans Trolls On Rohit Sharma After Reports Of Chameera Playing Match - Sakshi
Sakshi News home page

Ind Vs Sl 2nd Test: రోహిత్‌ శర్మపై దారుణమైన ట్రోల్స్‌.. చమీర‘సన్‌’ అంటూ మీమ్స్‌! హిట్‌మాన్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌!

Published Fri, Mar 11 2022 12:23 PM | Last Updated on Fri, Mar 11 2022 3:38 PM

Ind Vs Sl 2nd Test: Netizens Roast Rohit Sharma Chameera Playing Match Reports - Sakshi

Ind VS Sl Series 2022: ఇటీవలి టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంక పేసర్‌ దుష్మంత చమీర.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. చమీర దెబ్బకు రెండో టీ20లో హిట్‌మాన్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక మూడో టీ20 మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని.. 5 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. 

ఇక టెస్టు సిరీస్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్‌ హిట్‌ అయినప్పటికీ.. బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 28 బంతులు ఎదుర్కొని లాహిరు కుమార బౌలింగ్‌లో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇదిలా ఉండగా.. బెంగళూరు వేదికగా జరుగనున్న పింక్‌బాల్‌ టెస్టు నేపథ్యంలో..  తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ కుమార స్థానాన్ని దుష్మంత చమీరతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చమీర ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా రెచ్చిపోతున్నారు. రోహిత్‌ శర్మను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘చమీర దెబ్బకు వణికిపోతున్న చమీర‘సన్‌’ ఓ మూలకు నక్కి కూర్చుంటాడు. చమీర వస్తే రోహిత్‌ పరిస్థితి ఇది’’ అంటూ మీమ్‌లు షేర్‌ చేస్తున్నారు. అయితే రోహిత్‌ ఫ్యాన్స్‌ సైతం ఇందుకు దీటుగా బదులిస్తున్నారు. రోహిత్‌ ఒక్కసారి కుదురుకుంటే ఆపడం ఎవరితరం కాదని, చమీరకు అంత సీన్‌ లేదంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.

చదవండి: Ravindra Jadeja: రోహిత్‌, కోహ్లి, బుమ్రా మాత్రమే ఎందుకు.. జడేజా, రాహుల్‌ ఏం పాపం చేశారు?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement