బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవి చూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది. కాగా శ్రీలంకపై వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మొదటి వన్డేను డ్రాగా ముగించిన భారత్.. వరసుగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. మరోసారి స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. లంక స్పిన్నర్ల దాటికి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో సత్తాచాటగా.. థీక్షణ, జెఫ్రీ వాండర్సే తలా రెండు వికెట్లు సాధించారు.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భాతర కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్‌లో శ్రీలంక తమ కంటే బాగా ఆడిందని హిట్‌మ్యాన్ కొనియాడాడు.
"స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్ల తడబాటుపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్నీ మేము తీవ్రంగా పరిగణిస్తాము. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ సరైన గేమ్ ప్లాన్‌తో ఆడాల్సిన అవసరముంది. సిరీస్‌లో మేము ఒత్తిడికి గురయ్యాము.
తప్పు ఎక్కడ జరిగిందా అన్నది మేము చర్చించి తర్వాత మ్యాచ్‌ల్లో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. రాబోయే మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతే తప్ప టీ20 వరల్డ్‌కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. భారత్ తరుపన ఆడుతున్నంత కాలం మేము రిలాక్స్ అవ్వము. ముఖ్యంగా నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అటుంటి ఆంశాలకు అస్సలు చోటివ్వను.
ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ ఈ సిరీస్ మొత్తం మేము చెత్తగా ఆడాం. కానీ శ్రీలంకకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. వారు మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. అందుకే శ్రీలంక సిరీస్‌లో విజయం సాధించింది. మేము ఇక్కడి కండిషన్స్‌కు తగ్గట్లు మా జట్టు కాంబినేషన్‌ను మార్చాము.
జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లకు ఇటువంటి కండిషన్స్‌కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేశాం. ఈ సిరీస్‌లో మాకు సానుకూల అంశాల కంటే ప్రతికూల ఆంశాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై కచ్చితంగా దృష్టి పెడతాము. ఎందుకంటే మరోసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైతే బాగా ఆడాలి కాదా.
ఇక ఆటలో గెలుపోటములు సహజం. సిరీస్ కోల్పోవడం వల్ల ప్రపంచం ఏమి అంతం కాదు. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment