ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన లక్నోసూపర్‌జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన దుష్మంత చమీర గాయం నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 ఆరంభం నుంచి లక్నో జట్టుకు చమీరా అందుబాటులో ఉండనున్నాడు. మెగా వేలంలో చమీరాను రూ. 2 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇక గత ఏడాది ఆర్సీబీకి చమీరా ప్రాతినిధ్యం వహించాడు.
ఇక గాయం కారణంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. మెగా వేలంలో భాగంగా మార్క్ వుడ్‌ను 7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. అయితే అతడు దూరం కావడంతో జాసన్ హోల్డర్‌తో జట్టు పేస్ బౌలింగ్‌ను చమీరా పంచుకోనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా లక్నో సూపర్‌జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఇక లక్నోసూపర్‌జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
లక్నోసూపర్‌జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, అంకిత్ రాజ్‌పూత్, కె గౌతమ్, దుష్మంత చమీరా, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ మేయర్స్, కె. , కరణ్ శర్మ, ఎవిన్ లూయిస్, మయాంక్ యాదవ్
చదవండి: Rohit Sharma: రోహిత్ హోలీ విషెస్.. ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే! ఇంకేమైనా ఉందా!
Comments
Please login to add a commentAdd a comment