PC: IPL.COM
ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్‌లో లక్నో ప్రయాణం ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఫీల్డర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. అదే వాళ్ల ఓటమికి దారితీసింది. కాగా బెంగళూరు జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా ఉన్న దినేష్ కార్తీక్ క్యాచ్‌ను లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ జారవిడిచాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో.. కార్తీక్ బంతిని ఇన్‌ఫీల్డ్ దాటించడానికి ప్రయత్నించాడు. కాగా షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి కొంచెం గాల్లోకి లేచింది. దీంతో మిడ్-ఆఫ్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే దాదాపు క్యాచ్ తీసుకున్నాడు అనుకున్న సమయంలో అఖరి క్షణంలో బంతి చేతి నుంచి జారిపోయింది. ఈ క్రమంలో డగౌట్‌లో ఉన్న లక్నో మెంటార్ గౌతం గంభీర్ తీవ్రంగా నిరాశ చెందాడు. తొలుత రాహుల్ క్యాచ్ తీసుకున్నాడని భావించి చప్పట్లు కొట్టి అభినందించిన గంభీర్.. అఖరి క్షణంలో క్యాచ్‌ను విడిచి పెట్టడంతో ఒక్కసారిగా తల పట్టుకున్నాడు.
ప్రస్తుతం గంభీర్ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2 పరుగుల వద్ద కార్తీక్‌కు లైఫ్ రావడంతో అఖరిలో బౌండరీలు వర్షం కురిపించాడు. మరో వైపు 16 ఓవర్‌లో 72 పరుగుల వద్ద ఉన్న రజిత్ పాటిదర్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను దీపక్ హుడా జారవిడిచాడు. ఈ తప్పుకు లక్నో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. పాటిదర్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక కార్తీక్, పాటిదర్ కలిసి ఐదో వికెట్‌కు 92 పరుగులను జోడించి ఆర్‌సీబీ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!
— Guess Karo (@KuchNahiUkhada) May 25, 2022
Comments
Please login to add a commentAdd a comment