PC: కేఎల్ రాహుల్(IPL/BCCI)
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్-2022లో రాహుల్ 616 పరుగులు సాధించాడు. తద్వారా ఈ ఘనతను రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో 600 పైగా పరుగులు సాధించారు. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది.
దీంతో టోర్నీ నుంచి లక్నో నిష్క్రమించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (54 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్(79), దీపక్ హుడా (45) పరుగులతో రాణించారు.
చదవండి: IPL 2022: క్వాలిఫైయర్ 2కి బెంగళూరు ... లక్నోపై ‘సూపర్’ విక్టరీ...
Comments
Please login to add a commentAdd a comment