ఐపీఎల్ 2022లో ఆర్సీబీ అదరగొడుతుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, హర్షల్ పటేల్ 2, సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరొక ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment