
చెన్నై: టీమిండియా ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై అందరి దృష్టి పడింది. అంబటి రాయుడుని కాదని శంకర్‌ను జట్టులోకి తీసుకోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్‌కు దిగుతాడని భావించగా.. అతడు ఎంపిక కాకపోవడంతో ఆ స్థానంపై స్పష్టత రాలేదు. దీంతో విజయ్ శంకర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కీలకమైన నాలుగో స్థానం, జట్టులో శాశ్వత స్థానం కోసం హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్‌లు పోటీ పడుతున్నారని వార్తల చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా విజయ్ శంకర్ స్పందించాడు.
‘హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల సమర్థుడు. పాండ్యాతో నేను పోటీ పడుతున్నాన్న వార్తలు అసత్యం. మేము పోటీ పడితే టీమిండియాను గెలిపించడానికే తప్ప వేరేవాటి గురించి కాదు. పాండ్యా నేను మంచి స్నేహితులం. ప్రపంచకప్‌కు నేను ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ అనంతరం నాపై నాకు నమ్మకం కలిగింది.. విశ్వాసం పెరిగింది. ఐపీఎల్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సూచనలు ప్రపంచకప్‌లో ఎంతగానే ఉపయోగపడాతాయి. భారీ సిక్సర్లు కొట్టడం నాకు ఎంతో ఇష్టం. అయితే భారీ సిక్సర్లు కేవలం కండబలం ఉంటేనే కాదు టెక్నిక్ కూడా ఉండాలి. టెక్నిక్ లేకుంటే విఫలం అవుతాం’అంటూ విజయ్ శంకర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment