Kapata Nataka Sutradhari: 99 కోట్ల బంగారం కొట్టేశారు, తర్వాత? | Kapata Nataka Sutradhari Trailer Launched By Producer Ashwini Dutt | Sakshi
Sakshi News home page

Kapata Nataka Sutradhari: 99 కోట్ల బంగారం కొట్టేశారు, తర్వాత?

Published Sun, May 23 2021 11:47 AM | Last Updated on Sun, May 23 2021 11:47 AM

Kapata Nataka Sutradhari Trailer Launched By Producer Ashwini Dutt - Sakshi

వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత  సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ... ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కపట నాటక సూత్రదారి ట్రైలర్‌ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత మనీష్ మాట్లాడుతూ...మా కపట నాటక సూత్రదారి సినిమా ట్రైలర్‌ని ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠ భరితంగా, క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉంది. శ్రమ బ్యాంక్‌ సిబ్బంది తమ బ్యాంక్‌లోదాచుకున్న రూ.99 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారనేదే మిగతా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement